గంటాకు బిగ్ షాక్.. డిసెంబర్ లో ఆస్తి వేలం

టీడీపీ ఏమ్మెల్యె గంటా శ్రీనివాస్ రావు కి బిగ్ షాక్ తగిలింది. అయన కొన్ని అస్తులు వేలం వేస్తున్నట్టు ఇండియా బ్యాంక్ ప్రకటించింది. అసలు విషయం ఏమిటంటే.వివరాలలోకి వేళీతే..మాజీ మంత్రి, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భాగస్వామిగా ఉంటూ హామీ కింద తనఖా పెట్టిన ఆస్తిని డిసెంబరు 20వ తేదీన వేలం వేయనున్నట్లు విశాఖపట్నం ఇండియన్‌ బ్యాంక్‌ సోమవారం నోటీసు ప్రకటన విడుదల చేసింది. ప్రత్యూష రిసోర్సెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా(ప్రై) లిమిటెడ్‌లో గంటా శ్రీనివాసరావు భాగస్వామి. ఆయనతో పాటు సంస్థలోని మరో ఎనిమిది మంది కలిసి ఇండియన్‌ బ్యాంకులో రుణం తీసుకున్నారు.

అందుకు హామీగా కొన్ని స్థిరాస్తుల పత్రాలను సమర్పించారు. రుణం తీర్చకపోవడంతో బకాయి రూ.141.68 కోట్లకు చేరిందని బ్యాంకు 2016 సెప్టెంబరులో నోటీసు జారీచేసింది.వెంటనే చెల్లించాలని, లేదంటే హామీగా ఉంచిన ఆస్తులను వేలం వేస్తామని పేర్కొంది. ప్రత్యూష కంపెనీ నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో తాజాగా సోమవారం పత్రికా ప్రకటన జారీ చేసింది. వడ్డీ, ఇతర వ్యయాలు కలిపి బకాయి రూ.208.70 కోట్లకు చేరిందని, ఆస్తులను వేలం వేస్తున్నామని తెలిపింది. తేదీని కూడా ఖరారు చేసింది. విశాఖపట్నంలోని బాలయ్యశాస్త్రి లేఅవుట్‌ త్రివేణి టవర్స్‌లో ఫ్లాట్‌ నంబరు 11ను గంటా శ్రీనివాసరావు తన వాటాగా బ్యాంకు వద్ద తనఖా పెట్టారు. దానిని రూ.1.51 కోట్లకు వేలానికి పెడుతున్నట్లు బ్యాంకు పేర్కొంది. వీటితో పాటు ఇతర భాగస్వాముల ఆస్తులను వేలానికి పెట్టింది.

"
"