గల్లా జయదేవ్ అరేస్టు.. నాన్ బెయిలబుల్

గుంటురు ఎంపీ గల్లా జయదేవ్ కు అందరూ షాక్ ఇచ్చారు.  ఇప్పుడు  అమరావతిలో జరుగుతున్న పరీస్థితులలో   గుంటుర్ ఎంపీ గల్లా జయదేవ్  అమరావతి రైతులకు అండగా నిలవడ్డాడు. అయితే అయనను పోలిసులు కూడా అలాగే  అడ్డుపడ్డారు.అమరావతిలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. దీంతో పోలీసులకు అడుగడుగునా అడ్డం పడ్డ అనుచరులు,లాయర్లు,మహిళలు అడ్డుపడ్డారు. జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పి అర్ధరాత్రి మూడు గంటలకు మంగళగిరి మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచిన పోలీసులు.

 

దీంతో మంగళగిరి మేజిస్ట్రేట్ ముందు బెయిల్ నిరాకరణ. జనవరి 31వరకు రిమాండ్ విధించారు. హుటాహుటిన తెల్లవారు జామున 4.30గంటలకు గుంటూరు సబ్ జైలుకు తరలించారు.సోమవారం ఉదయం పోలీసుల నిఘా, నిషేధాజ్ఞలను దాటుకుని అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి గల్లా జయదేవ్ వ్యూహాత్మకంగా చేరుకున్నారు. పొలాల దారిలో ఆయన అసెంబ్లీ ముట్డడికి బయల్దేరారు. దీంతో పోలీసులు జయదేవ్‌ను అడ్డుకొన్నారు. ఈ క్రమంలో పోలీసులు, జయదేవ్‌కు మధ్య పెనుగులాట జరిగి ఆయన చొక్కా సైతం చిరిగిపోయింది. దీంతో పోలీసులు జయదేవ్‌ను అదుపులోకి తీసుకుని దుగ్గిరాల, పెదకాకాని, గుంటూరు మీదుగా నరసరావుపేట.. అక్కడి నుంచి రొంపిచర్ల స్టేషన్‌కు తరలించారు. అనంతరం నాన్‌బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. రొంపిచర్ల పోలీసుస్టేషన్‌ నుంచి గుంటూరు తీసుకొచ్చి అర్ధరాత్రి వరకూ పోలీసు వాహనంలోనే కూర్చోబెట్టారు. అర్ధరాత్రి 12.30 గంటలకు జీజీహెచ్‌ వైద్యులతో జయదేవ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు.

"
"