ఎందులో ఉంటారో మీరే తేల్చుకోండి.. దగ్గుబాటికి తేల్చి చెప్పిన వైసీపీ

దగ్గుబాటి  వెంకటేశ్వరరావు  కి,వైఎస్ జగన్ బిగ్ షాక్ ఇచ్చాడు. వైసీపీలో కోనసాగాలంటే ఇలానే ఉండాలీ అని కోన్ని నిబందనలు పెట్టాడు. ఏందుకంటే దగ్గుబాటి ఫ్యామిలీది ప్రత్యేకమైన  రాజకీయం  దగ్గుబాటి పురందేశ్వరీ బీజెపీలో, దగ్గుబాటి వేంకటేశ్వర్లు వైసీపీలో రెండు పడవల ప్రయాణం లాగా ఒక పార్టి తేడా కోడితే మారు మాట్లాడకుండా వేరే పార్టీలోకి వేళ్తారు. అని అందరు అనుకుంటున్నారు.ఎన్నికలకు ముందు చెరో పార్టీలో ఉండేందుకు సీనియర్‌ నాయకుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి దంపతులకు అవకాశం ఇచ్చిన వైసీపీ అధిష్ఠానం.. ప్రస్తుతం అటోఇటో తేల్చుకోవాలని పరోక్షంగా అల్టిమేటం ఇచ్చినట్లు తెలిసింది.

మొన్నటి ఎన్నికల్లో దగ్గుబాటి పరుచూరులో వైసీపీ అభ్యర్థిగా, పురందేశ్వరి విశాఖ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి.. ఓడిపోయిన సంగతి తెలిసిందే. బీజేపీ తన రాజకీయ వైఖరిని మార్చుకుని జగన్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న క్రమంలో ఆ పార్టీలో కీలక నాయకురాలైన పురందేశ్వరి కూడా అదే పంథా అనుసరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబమంతా వైసీపీలో ఉంటుందో.. లేక బీజేపీలో ఉంటుందో తేల్చాలని సీఎం జగన్‌ స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో పురందేశ్వరితో బీజేపీకి రాజీనామా చేయించాలని వైసీపీ అధిష్ఠానం దగ్గుబాటిపై ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం. దీనిపై జగన్‌తో మాట్లాడేందుకు ఆయన నెలన్నర నుంచి ప్రయత్నిస్తున్నా.. అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదు.సరికదా.. గత ఎన్నికలకు ముందు పరుచూరులో వైసీపీ ఇన్‌చార్జిగా ఉండి.. దగ్గుబాటి రాకతో టీడీపీలో చేరిన రావి రామనాథంబాబును మళ్లీ పార్టీలోకి తీసుకొచ్చారు. పనులన్నీ ఆయనకే చేయాలని వైసీపీ అధిష్ఠానం మంత్రులకు ఆదేశాలు కూడా ఇవ్వడం గమనార్హం. వైసీపీ నేత విజయసాయిరెడ్డితో మాట్లాడేందుకు ప్రయత్నించినా దగ్గుబాటికి అవకాశం ఇవ్వలేదని తెలిసింది. దీంతో కొద్దిరోజులుగా దగ్గుబాటి నియోజకవర్గానికి దూరంగా హైదరాబాద్‌లో ఉంటున్నారు.

నియోజకవర్గంలోని ఆయన అనుచరగణం తరచూ పోయి ఆయన్ను కలుస్తున్నారు. దీనిపై దగ్గుబాటి, పురందేశ్వరి, వారి కుమారుడు హితేశ్‌ అంతర్గతంగా, అనుయాయులతోనూ మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. జగన్‌ నుంచి పిలుపు వస్తే వెళ్లి మాట్లాడాక తుది నిర్ణయం తీసుకోవాలన్నది దగ్గుబాటి అభిమతంగా ఉన్నట్లు ఆయన సన్నిహితుల ద్వారా తెలిసింది.

"
"