భారత్ పై కోపంతో వున్న చైనా అసలు రీజన్ ఇదేనా..

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానంలో భారత్ తెచ్చిన మార్పుల పట్ల చైనా మండిపడింది. ఇది వివక్ష పూరితమని, స్వేఛ్చా వాణిజ్యానికి వ్యతిరేకమని, ప్రపంచ వాణిజ్యం సంస్థ నియమనిబంధనలకు విరుద్ధమని వ్యాఖ్యానించింది. ఈ విధానాన్ని పునఃసమీక్షించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.ఎఫ్‌డీఐలో భారత్ చేసిన మార్పులు ఏమిటి..?కొత్తగా తెచ్చిన మార్పుల ప్రకారం భారత్ పొరుగు దేశాలైన పాకిస్థాన్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్‌లకు చెందిన కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టాలంటే ముందుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

 

వీటిలో కొన్ని దేశాలపై గతంలోనే ఇటువంటి ఆంక్షలు విధించగా.. తాజాగా చైనా కూడా ఈ జాబితాలోకి వచ్చి చేరింది. అంతకు మునుపు ప్రభుత్వ అనుమతి లేకుండా ఆటోమేటిక్ విధానంలో భారత్‌లోకి ప్రవేశించే అవకాశం చైనా కంపెనీలకు ఉండేది. ప్రభుత్వం తీసుకున్న తాజాగా నిర్ణయంతో చైనా ఈ అవకాశాన్ని కోల్పోయింది.చైనా కేంద్ర బ్యాంకు అయిన పీపుల్స్ బ్యాంకు ఆఫ్ చైనా ఇటీవల హెడ్‌డీఎఫ్‌సీలో తనకున్న వాటాను 1.01 శాతానికి పెంచుకున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ మార్పులకు శ్రీకారం చుట్టింది. కరోనా ధాటికి బలహీలనపడిన ఆర్థిక వ్యవస్థను తమ అనుకూలంగా మలుచుకుని విదేశీ సంస్థలు భారత్ కంపెనీలను టేకోవర్ చేయికూడదనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం ఈ రకమైన మార్పులను చేసింది. ముఖ్యంగా భారత కంపెనీలపై చైనా ప్రాబల్యం పెరగకుండా ఉండేందుకు ఈ మార్పులు వచ్చాయని వాణిజ్య వేత్తలు అభిప్రాయపడుతున్నారు.

"
"