చంద్రబాబు వైపు చూస్తున్న యువత… ఎందుకు…?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు… అధికారంలో ఉన్న సమయంలో జాతీయ మీడియాలో, ప్రధాన మీడియాలో ఎప్పుడు ఏదోక కంపెనీ రాష్ట్రంలో ఒప్పందం చేసుకుంది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడేవి. విదేశీ పర్యటనలో పలానా కంపెనీ చంద్రబాబు తీసుకొచ్చారని, ఈ కంపెనీ ద్వారా ఇన్ని ఉద్యోగాలు వస్తున్నాయని, త్వరలోనే పెట్టుబడులు పెడతారని అంబాని, అధాని, కియా, హీరో, గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇలా ఎన్నో కంపెనీలు ముందుకి వచ్చాయి. ఉద్యోగ అవకాశాలకు ఇక ఇబ్బంది ఉండదు అంటూ తెలుగుదేశం చెప్పేది.మరి ఇప్పుడు…? వాలంటీర్ ఉద్యోగాలు మినహా ఏ ఒక్క కంపెనీ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోలేదు.

కనీసం చిన్న చిన్న కంపెనీలు కూడా రాష్ట్రానికి వచ్చే పరిస్థితి కనపడటం లేదు. ఈ నేపధ్యంలో యువత ఆలోచనలో పడింది అంటున్నారు. చంద్రబాబు విలువ యువతకు ఇప్పుడు అర్ధమైందని అంటున్నారు. రాష్ట్రంలో ఇప్పుడు చాలా కంపెనీలు వెళ్ళిపోయే ఆలోచనలో ఉన్నాయి అనే విషయం కొన్ని రోజులుగా స్పష్టంగా అర్ధమవుతుంది. అసలు ఇక్కడికి రావాలి అంటేనే ఆలోచించే పరిస్థితి రాష్ట్రంలో ఉందనే వ్యాఖ్యలు కూడా వినిపించాయి.నిరుద్యోగ భ్రుతి, అన్నా క్యాంటిన్ కూడా ప్రభుత్వం ఆపేసింది. వాటి ద్వారా కుటుంబాలకు యువత భారం అయ్యే వాళ్ళు కాదు. సిటిలలో ఏదోక పని దొరుకుతుంది గాని గ్రామాల్లో ఉన్న వారికి ఇప్పుడు పని దొరక, ప్రభుత్వ సాయం అంధక… నిరుద్యోగ భ్రుతి లేక ఇబ్బందికరంగా మారింది. తాము నమ్మి మోసపోయాము అనే భావనలో చాలా వరకు యువత ఉందని ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు వస్తే తమకు ఏదోక ప్రయోజనం చేకూరుతుంది అనే భావనలో ఉన్నారని అంటున్నారు. మళ్ళీ అవకాశం వస్తుందా అంటూ ఎదురు చూస్తుంది యువత.

"
"