చంద్రబాబు షాకింగ్ ప్రకటన… ఛలో అసెంబ్లీ కి పిలుపు

చంద్రబాబు  సంచలన ప్రకటన చేశాడు. ఏపీలో ఇప్పుడు వున్న పరీస్థితులలో చాలా కష్టలలో వుందని అయినా కూడా అలాగే చేస్తుందని చంద్రబాబు మండిపడ్డాడు. ప్రజలను పక్కన పేట్టారని, అసలు ఇప్పుడూ  రాష్ట్రం ఎలాంటి పరీస్థీతులలో వుందో కూడా పట్టించుకోవడం లేదని తెలుపారు.సోమవారం ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కానుంది. ఈ సమావేశల్లో ఏపీ రాజధానిపై ప్రభుత్వం ప్రకటన చేయనుందని వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. ముళ్ల కంచెలు వేసినా సరే వాటిని దాటుకొని ఛలో అసెంబ్లీకి రావాలని నేతలకు తెలిపారు. .

 

అయితే పోలీసులు మాత్రం ఛలో అసెంబ్లీ, జైల్ భరో లాంటి కార్యక్రమాలకు ఎలాంటి అనుమతులు లేవంటున్నారు. మరోవైపు అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పోలీసులు భారీగా మోహరించారు. అదనపు బలగాలు సైతం రంగంలోకి దించారు. అటు రాజధాని గ్రామాల్లో కూడా భారీ ఎత్తున పోలీసులు పహారా కాస్తున్నారు.టీడీపీ ఎమ్మెల్యేలకు విప్ కూడా జారీ చేశారు. పార్టీ ఆదేశాలనుశారం ఓటు వేయాలని ఆదేశించారు. వల్లభనేని వంశీ, మద్దాలి గిరికి సైతం టీడీపీ విప్ జారీ చేసింది. ప్రభుత్వం సభలో సీఆర్డీఏ బిల్లు సవరణ..రద్దు.. మూడు రాజధానుల అంశం పైన తీర్మానం..వంటి వాటిల్లో ఏ రూపంలో సభ ముందుకు ప్రతిపాదనలు తీసుకొచ్చే అవకాశం ఉందనే దాని పైన టీడీపీ ఫోకస్ పెట్టింది. ఏ రూపంలో బిల్లు సభ ముందుకు వచ్చినా… ఏ రకంగా ఎదుర్కోవాలనేది దానిపై వ్యూహాలు సిద్దం చేస్తోంది. అందులో భాగంగా.. పార్టీ శాసన సభ్యులు… శాసనమండలి సభ్యులకు పార్టీ విప్ జారీ చేసింది.

"
"