అమరావతి కోసం చంద్రబాబు పోరాటం… ప్రభుత్వం దిగివచ్చేలా..

ఏపీలో రాజధాని రగడ రోజురోజుకు  పెరుగుతూనే వుంది.  అయన గత కోన్ని రోజులుగా అమరావతిలోనే  వుంటూ ప్రజలకు అండగా నిలుస్తున్న విషయం తేలిసిందే. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ… ప్రతిపక్ష టీడీపీ ఆందోళనలను మరింత పెంచుతోంది. ఇవాళ్టి నుంచీ టీడీపీ అధినేత చంద్రబాబు… బస్సు యాత్రగా వెళ్తున్నారు. ముందుగా ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా… ఏలూరు నుంచీ మొదలయ్యే బస్సు యాత్రం… తాడేపల్లి గూడెం, తణుకు, రాజమండ్రి వరకూ సాగనుంది. ఆ తర్వాత కోటిపల్లిలో చంద్రబాబు బహిరంగ సభలో ప్రసంగిస్తారని తెలిసింది. ఐతే… ఈ సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని సమాచారం.

 

మరోవైపు బుధవారం చంద్రబాబును అరెస్టు చేసిన సందర్భంగా… గురువారం ఏపీలో టీడీపీ శ్రేణులు ఆందోళనలు, ర్యాలీలూ చేశాయి. అమరావతి పరిరక్షణ సమితి – జేఏసీ అధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర తలపెట్టి… ఆ బస్సుల్ని బెంజి సర్కిల్‌లో కొత్తగా ప్రారంభించిన జేఏసీ కార్యాలయం నుంచి ప్రారంభించాలని చంద్రబాబు అనుకున్నారు. ఐతే… బస్సులను ఆటోనగర్‌లోనే పోలీసులు ఆపేశారు. దాంతో చంద్రబాబు రోడ్డుపైనే ఆందోళనకు దిగారు. ఆ క్రమంలో అరెస్టయ్యారు. ఐతే… బాబుకి మద్దతుగా జరిపిన ర్యాలీలు, ఆందోళనల్లో కూడా అరెస్టులు కొనసాగాయి. కొన్ని చోట్ల పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాటలు జరిగాయి. పశ్చిమగోదావరి జిల్లాలో రాస్తారోకోలు, ధర్నాలు చేశారు. ఏలూరులో మహిళలు భారీ నిరసన ర్యాలీ చేసి, కలెక్టరేట్‌ దగ్గర మానవహా

"
"