చంద్రబాబుతో టచ్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు… ఆనం ఒక్కరే కాదా…?

ఆంధ్రప్రదేశ్ లో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు నేరుగా ఆయన పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల‌పైనే విమర్శలు ఎందుకు చేసారు ? అనేది ఎవరికి అర్ధం కాలేదు. ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి లక్ష్యంగా ఆయన విమర్శలు చేసారని… వాళ్ళు ఇద్దరు బెట్టింగ్, ఇసుక వంటి మాఫియాలు చేస్తున్నారనే ఆయన ఆరోపణలు చేసారని అంటున్నారు. ఇక తనకు ఏ మాత్రం విలువ ఇవ్వడం లేదని, వైఎస్ దగ్గర కీలక శాఖలకు మంత్రిగా పని చేసాను అని… అలాంటి తన మీద కొంత మంది పెత్తనం ఏంటి అనే భావనలో ఉన్నారట.

అంత వరకు బాగానే ఉన్నా… ఇప్పుడు ఆయన వ్యవహారంలో కొన్ని విషయాలు అధికార పార్టీ నేతలను కంగారు పెడుతున్నాయి. ఆయన వర్గానికి చెందిన 4 ఎమ్మెల్యేలు, అటు చిత్తూరు, ఇటు నెల్లూరు జిల్లాల్లో తెలుగుదేశం నేతలతో టచ్ లో ఉన్నారని అంటున్నారు. మాజీ జెడ్పీ చైర్పర్సన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ద్వారా ఆనం తన ఎమ్మెల్యేలను తెలుగుదేశంలోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నారనే సమాచారం జగన్ కి అందినట్టు తెలుస్తుంది. బొమ్మిరెడ్డికి జిల్లాలో మంచిపేరు ఉంది… సౌమ్యుడిగా కూడా ఆయనకు గుర్తింపు ఉంది.దీనితో ఆయనతో ఉన్న స్నేహాన్ని ఆనం వాడుకునే ప్రయత్న౦ చేస్తున్నారట. అందుకే రేణిగుంట విమానాశ్రయంలో ఆయన చంద్రబాబుని కలిసారట.

ఇక మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే… ధర్మాన ప్రసాదరావు కూడా తెలుగుదేశం లేదా బీజేపీలోకి వెళ్లే ఆలోచనలో ఉన్నారట. ఆయనకు కనీస ప్రాధాన్యత జిల్లాలో గాని నియోజకవర్గంలో గాని లభించడం లేదనే ప్రచారం జరుగుతుంది. తన మాట… అసలు అధికారులు కూడా వినడం లేదని, ఆయన కూడా త్వరలో తిరుగుబాటు బావుటా ఎగురవేసే అవకాశం ఉందనే ప్రచారం ఇప్పుడు జోరుగా జరుగుతుంది.

"
"