చంద్రబాబు మరో నిర్ణయం… బస్సుయాత్ర మొదలు..

రాష్ట్రంలో ఇప్పుడు వున్న పరీస్థీతులలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు వ్యతిరేకంగా టీడీపీ  ప్రజలకు అండగా వుంది. అలాగే ఏలాగైనా సరే  అమరావతి ఇక్కడ నుండి  కదలదని చేప్తూనే ప్రజలకు ధైర్యం ఇస్తూ , వైసీపీ తీసుకుంటున్న నిర్ణయాలకు అడ్డుగా నిలబడుతూనే వుంది.ఏపీలో 3 రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతి పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో మొన్నటి వరకు ఆందోళనలు చేపట్టిన టీడీపీ.. తాజాగా భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది. ప్రభుత్వ వైఫల్యాలు, పెట్టబడులు, మూడు రాజధానులు, సంక్షేమ పథకాల కోత, ఇసుక కొరత సహా పలు అంశాలపై జగన్ సర్కార్‌ని ఎండగట్టడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు ప్రజా చైతన్య యాత్ర చేయబోతున్నారు.

 

మంగళవారం జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం కానున్న బస్సు యాత్రం.. మొత్తం 175 నియోజకవర్గాల్లో 45 రోజుల పాటు కొనసాగనుంది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇంచార్జీ నేత‌ృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది టీడీపీ. ఐతే యాత్రను ఎక్కడి నుంచి ప్రారంభిస్తారు? రూట్ మ్యాప్ ఏంటన్న దానిపై రెండు మూడు రోజుల్లో క్లారిటీ రానుంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనునున్న నేపథ్యంలో.. ఆ ఎన్నికలకు ముందే బస్సు యాత్ర పూర్తి చేయాలని పార్టీ నేతలను చంద్రబాబు ఆదేశించారు.

"
"