చంద్రబాబు అసెంబ్లీలో చేసిన పనితో, అవేదన చెందిన తెలుగు తమ్ముళ్ళు…

‘జగన్మోహన్‌రెడ్డిగారూ! చిన్నవాడివైనా రెండు చేతులెత్తి నమస్కరించి చెబుతున్నాను. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మూడు రాజధానులు ఎక్కడా రాణించలేదు’ అని ప్రతిపక్ష నేత చంద్రబాబు అసెంబ్లీలో సీఎంను అభ్యర్థించారు. అమరావతిని కొనసాగించాలని కోరారు. మూడు రాజధానుల బిల్లుపై సోమవారం సభలో చంద్రబాబు ప్రసంగించారు. అడుగడుగునా మంత్రులు, అధికారపక్ష సభ్యులు అడ్డు తగిలారు.అయినా ఆయన తన ప్రసంగం కొనసాగించారు.రాష్ట్రానికి ఒక్క రాజధానే ఉండాలని టీడీపీ సిద్ధాంతమని, అమరావతిని రాజధానిగా నిర్ణయించామని.. ప్రధాని మోదీ, కేసీఆర్‌ కూడా ప్రశంసించారని గుర్తు చేశారు.

 

అమరావతికి ఇప్పటి వరకు 130 సంస్థలు వచ్చాయన్నారు. నిర్మాణానికి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదని, కామధేనువులా ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రస్తుతమున్న అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టులో కార్యక్రమాలు కొనసాగించుకుంటే.. ఆదాయం వచ్చినప్పుడు శాశ్వత భవనాలు నిర్మించుకోవచ్చని సూచించారు. తానీ భవనాలను టెంపరరీ అనలేదని, ట్రాన్సిట్‌ భవనాలని మాత్రమే అన్నానని.. అది అర్థం కాక తాత్కాలిక రాజధాని అన్నట్లుగా ఆరోపణలు చేస్తున్నారని ఆక్షేపించారు. జగన్‌ తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తనపై రాజకీయంగా దాడి చేసినా.. తన తర్వాత సీఎం అయినప్పుడు తాను మొదలుపెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేశారని.. అందుకే ఇద్దరికీ మంచిపేరు వచ్చిందన్నారు.

"
"