ఉల్లి ధ‌ర‌లపై తూకం వేసి కౌంట‌ర్ ఇచ్చిన బాబు

ప్ర‌స్తుతం ఏపీలో ఉల్లి ధ‌ర‌లు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్ప‌టికే కేజీ ఉల్లి రు.200 మార్క్ క్రాస్ చేసింది. మ‌రి కొన్ని చోట్ల నాసిర‌కం ఉల్లి పాయ‌లు సైతం రు.150కు అమ్ముతున్నారు. ఉల్లి ధ‌ర‌ల పెంపుపై ఈ రోజు అసెంబ్లీ స‌మావేశాల్లో ప్ర‌తిప‌క్షం వినూత్నంగా నిర‌స‌న వ్య‌క్తం చేసింది. టీడీపీ ఎమ్మెల్యేలు మొడ‌లో ఉల్లి దండ‌లు వేసుకుని వెళ్లి మ‌రీ నిర‌స‌న వ్య‌క్తం చేశారు.ఇక సచివాలయం ఫైర్‌స్టేషన్‌ వద్ద చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ నేతల నిరసన తెలిపారు. ఇక టీడీపీ అధినేత చంద్ర‌బాబు అయితే తక్కెడలో బంగారం, ఉల్లిపాయలు పెట్టి రెండూ సమానమేనని చూపించ‌డంతో పాటు త‌న దైన మార్క్‌లో నిర‌స‌న తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ

రాష్ట్రంలో ఉల్లిధరలు బంగారంతో సమానంగా ఉన్నాయ‌ని… ఉల్లి ధరలను ప్రభుత్వం నియంత్రించలేకపోతోంద‌ని విమ‌ర్శించారు.టీడీపీ ప్ర‌భుత్వ హయాంలో నిత్యావసర ధరలు పెరగకుండా చర్యలు తీసుకున్నాం అని… సబ్సిడీపై తక్కువ ధరలతో ఉల్లి అందించాయ‌ని… ధరలు దిగివచ్చేవరకు మా పోరాటం కొనసాగుతుంద‌ని చెప్పారు. అసెంబ్లీ ప్రధాన ద్వారం టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు… ప్ల‌కార్డులతో అనుమతి లేదని చంద్రబాబును గేటు వద్దే పోలీసులు ఆపేశారు.ఈ క్ర‌మంలోనే టీడీపీ నేత‌ల‌కు, పోలీసుల‌కు మ‌ధ్య తీవ్ర‌మైన వాగ్వివాదం చోటు చేసుకుంది. ఏదేమైనా అసెంబ్లీ స‌మావేశా తొలి రోజునే అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్ర‌భుత్వం శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తోంది.

"
"