యూపీ ప్రభుత్వం షాకింగ్ డేసిషన్…లాక్ డౌన్ పోడిగింపు…

కరోనా మహమ్మారి తీవ్రత తగ్గకపోవడంతో పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మే 3 వరకూ కొనసాగిస్తూనే మరో సంచలన నిర్ణయం తీసుకుంది. జూన్ 30 వరకూ జనాలు గుమిగూడవద్దని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరినీ ఉపేక్షించమని ఆయన తేల్చి చెప్పారు.   కేంద్ర ప్రభుత్వం ముందే ప్రకటించినట్లు మే 3 వరకూ లాక్‌డౌన్ అమలులో […]

అన్నిటికి రెడీగా వున్న శివసేన…

మహారాష్ట్రలో కరోనా కట్టడికి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తలమునకలై ఉంటే, మరోవైపు ఆయన తలపై ‘గవర్నర్’ నిర్ణయమనే కత్తి వేలాడుతోంది. విధాన పరిషత్‌లో ఖాళీగా ఉన్న రెండు స్థానాల్లో ఒక స్థానానికి ఉద్ధవ్‌ను నామినేట్ చేయాలని మహారాష్ట్ర మంత్రివర్గం సిఫారసు చేసి పక్షం రోజులైంది. అయినప్పటికీ గవర్నర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం సంక్షోభం ముంచుకొస్తోందా అనే సందేహాలకు తావిస్తోందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాకరే కొనసాగాలంటే మే 28కి ముందే, అంటే ఆరు […]

తెలంగాణా సర్కార్ కి రేవంత్ రెడ్డి సూచనలు….

లాక్‌డౌన్, సెల్ఫ్ క్వారంటైన్ శాశ్వత పరిష్కారం కాదని, ఇది కేవలం ఉపశమనమేనని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి చెప్పారు. దక్షిణకొరియా తరహాలో ట్రేస్, టెస్ట్, ట్రీట్ విధానం అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచనలు చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కు వచ్చే నిధుల్లో పారదర్శకత లేదని, కొనుగోలు ఒప్పందాల పేరుతో సేకరిస్తున్న నిధుల్లో చీకటి కోణం ఉందని ఆరోపించారు. కరోనాకు ప్రభుత్వం చేసిన ఖర్చు.. 2వేల కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చినవేనని వెల్లడించారు.   కరోనా […]

కేంద్రం మరో కీలక నిర్ణయం….

లాక్‌డౌన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్ పెంచరాదని నిర్ణయం తీసుకుంది. జనవరి ఒకటి నుంచి పెండింగ్ ఉన్న మొత్తాన్ని కూడా చెల్లించరు. దీని ప్రకారం 2021 జులై వరకూ డిఏ, డీఆర్ పెరగదు.దేశ వ్యాప్తంగా మార్చి 24 అర్ధరాత్రి నుంచి ఏప్రిల్ 14 వరకూ తొలి విడత లాక్‌డౌన్ కొనసాగగా రెండో విడత లాక్‌డౌన్ మే 3 వరకూ కొనసాగనుంది.   […]

ఏపీలో ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండటంతో రాష్ట్ర ప్రజలు భయంతో వణికిపోతున్నారు. గడిచిన 24 గంటల్లో 80 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్‌ల సంఖ్య 893కి చేరుకుంది. ఇవాళ ఒక్కరోజే కర్నూల్‌లో- 31, గుంటూరులో -18, చిత్తూరు-14 కొత్త కేసులు నమోదవ్వడం గమనార్హం.   నిన్న మొన్న కాస్త తగ్గుముఖం పట్టిందని అనుకున్నప్పటికీ 24 గంటల్లో అనూహ్యంగా కేసులు […]

మమత బెనర్జీ మరో ప్రకటన…షాక్ లో పశ్చిమ బెంగాల్

మే నాలుగు తర్వాత మొత్తం లాక్‌డౌన్ ఎత్తేయడం వైపే తాను మొగ్గు చూపుతానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. అయితే అది మూడు దశల్లో చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ‘‘మే నాలుగు తర్వాత లాక్‌డౌన్ ఎత్తేయాలన్నదే ఓ పౌరురాలిగా, టీఎంసీ చీఫ్‌గా నా అభిప్రాయం. అయితే అది మూడు దశల్లో అయితే బాగుంటుంది’’ అని తెలిపారు.   మే నాలుగు తర్వాత మొదటి వారం రోజుల పాటు 25 శాతం, ఆ తర్వాత […]

తెలంగాణాలో ఒక్కసారిగా పెరిగిన కరోనా కేస్ లు

కరోనా మహమ్మారి నుంచి తెలంగాణకు బుధవారం కాస్త ఊరట లభించింది. గత మూడు రోజులుగా రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తెలంగాణలో మంగళవారం ఒక్కరోజే 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే.. ఈ సంఖ్య బుధవారం అనూహ్యంగా తగ్గడం కాస్త ఊరట కలిగించే విషయం. బుధవారం కొత్తగా తెలంగాణలో 15 కేసులు నమోదయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో కేసులు సంఖ్య 943కి చేరింది. కరోనాతో బుధవారం ఒకరు మృతి చెందారు. మొత్తం మృతుల […]

ఇరకాటంలో పడ్డ యడ్యూరప్ప…

జేడీఎస్ అధినేత కుమారస్వామి కుమారుడు నిఖిల్ పెళ్లి వివాదం యెడ్యూరప్ప మెడకు చుట్టుకుంటోంది. పెళ్లికి అనుమతి ఎలా ఇచ్చారని కర్ణాటక హైకోర్టు యెడ్డీ సర్కారును ప్రశ్నించింది. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తుంటే చూస్తూ ఎలా ఊరుకున్నారని ప్రశ్నించింది. వెంటనే జవాబివ్వాలని కోరింది.   ఈ నెల 17న బెంగళూరు రామ్‌నగర్ ఫామ్‌హౌస్‌లో కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి క్రిష్ణప్ప మనవరాలు రేవతితో నిఖిల్ వివాహం జరిగింది. పెళ్లిలో బంధువులు మాస్కులు ధరించకపోవడం, సామాజికదూరం పాటించకపోవడంతో రచ్చ మొదలైంది. వాస్తవానికి […]

రోజారెడ్డిని బుక్‌చేసిన‌ పెద్దిరెడ్డి

బోరింగు ఓపెనింగుకి వెళ్లి పూలు చల్లించుకోవడం..దానిని వీడియో తీసి నేషనల్ మీడియా వ‌ర‌కూ చేర‌వేసి రోజారెడ్డిని దారుణంగా దెబ్బ‌తీయ‌డంలో మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి హ‌స్తం ఉంద‌ని రోజా ర‌గిలిపోతున్నారు. వాస్త‌వంగా రోజా వెళ్లిన కార్య‌క్ర‌మాన్ని షూట్ చేయ‌డానికి తెలుగుదేశం వారు కానీ, సోష‌ల్ మీడియా వాళ్లు కానీ ఎవ‌రూ లేరు. అక్క‌డున్న వైఎస్సార్‌సీపీ వాళ్లే వీడియో తీసి మ‌రీ నేష‌న‌ల్ మీడియా వ‌ర‌కూ చేర‌వేయించ‌గ‌లిగారు. దీనివెనుక మంత్రి పెద్దిరెడ్డి ఉన్నార‌ని రోజాకి క్లియ‌ర్‌గా తెలుసు. అయినా పార్టీ […]

కేరళలో ఒక్కసారిగా పెరిగిన కరోనా…

భారత్‌లో కరోనా కట్టడి చర్యల్లో కేరళ ముందుందని, కరోనాను కేరళ రాష్ట్రం జయించిందన్న వార్తల నేపథ్యంలోనే ఆ రాష్ట్రంపై కరోనా మళ్లీ పంజా విసిరింది. మంగళవారం ఒక్కరోజే కేరళలో 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం అక్కడి ప్రజలను విస్మయానికి గురి చేసింది. ఒక్క కన్నూర్‌లోనే 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం.పాలక్కడ్‌లో నాలుగు, కాసర్‌గోడ్‌లో మూడు, మలప్పురం, కొల్లాంలో ఒక్కో కేసు నమోదైంది. గత కొద్ది రోజులుగా కేరళలో కరోనా పాజిటివ్ […]