ఏపీలో మత ప్రచారంపై బీజేపీ ఆరా… !

జెరూసలేం వెళ్ళే వారికి 60 వేల వరకు ఆర్ధిక సాయం… చర్చి పాస్టర్లకు నెల నెలా 5 వేలు, గ్రామ సచివాలయ కార్యాలయాల్లో యేసు ప్రభు ప్రార్ధనలు, ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యనారాయణ కొండపై అన్యమత ప్రచారం ఎదురు తిరిగిన వారిపై దాడి, తిరుమలలో అన్యమత ప్రచారం, బస్ టికెట్లపై మత ప్రచారం… టీటీడి చైర్మన్ గా నియమించిన వ్యక్తి క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తి… ఇక తిరుమల ఉద్యోగుల్లో పెరుగుతున్న క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తులు… వ‌లంటీర్లలో చాలా మంది క్రైస్తవ మతానికి చెందిన వారే.. !

కట్ చేస్తే… తిరుమలలో అద్దె గదుల ధరలు పెంపు, అర్జిత సేవలను రద్దు చేయడం, మరికొన్ని సేవల రద్దు దిశగా చర్యలు, లడ్డు ధర పెంచడం, టీటీడి అధికారిక వెబ్ సైట్ లో మత ప్రచారం, కనకదుర్గ గుడిలో ధరల పెంపు… తిరుమల కొండపై మంత్రుల వ్యాఖ్యలు… ఇప్పుడు ఇవన్ని కూడా కేంద్రం ఆరా తీయడం మొదలుపెట్టింది. గత ఆరు నెలలుగా రాష్ట్రంలో మత ప్రచారం అనేది విచ్చలవిడిగా జరుగుతుందనే సమాచారం కేంద్రానికి అందింది అని పరిశీలకులు అంటున్నారు.ఏపీలో క్రైస్తవ మతానికి చెందిన వారికి అధిక ప్రాధాన్యత లభిస్తుందని, వారి మాటే ఎక్కడైనా చెల్లుబాటు అవుతుందని, హిందు దేవాలయాల పూజలు జరిగే సమయంలో పెద్ద పెద్దగా సౌండ్లు పెట్టి మత ప్రచారం చేస్తున్నారని, కొందరికి డబ్బులు కూడా ఇచ్చి మతం మార్పిస్తున్నారనే ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది. దీనిపై కేంద్రం గుర్రు గా ఉంది.ఇటీవ‌ల విజ‌య‌వాడ కృష్ణా న‌దిలోనే మ‌త మార్పిళ్లు జ‌రుగుతుండ‌డాన్ని కూడా ఏపీ బీజేపీ సీరియ‌స్‌గా తీసుకుని కేంద్రానికి ఫిర్యాదు చేసింది.

వాస్తవానికి బిజెపి ఓటు బ్యాంకు ఎక్కువగా హిందు ఓటు బ్యాంకు… దానినే రాష్ట్ర౦లో తగ్గిస్తున్నారు అనే ప్రచారం జరుగుతుంది. దీనితో ఇప్పుడు కేంద్రం జోక్యం చేసుకుని కొన్ని చర్యలకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉందని… స్వయంగా కేంద్ర పెద్దలు దీనిపై సమాచారం కూడా సేకరిస్తున్నారని అంటున్నారు.

"
"