బిజేపీ ప్లాన్ అదిరింది…? టీఆర్ఎస్ కి చెక్ పెట్టేలా..?

తెలంగాణా లో బిజేపీ రోజు రోజుకు బలపడుతుంది. ఇక రాష్ట్రంలో ఇప్పుడు నెతలు కరువైనా కూడా ఇక భవిష్యత్త్ లో పార్టిని అధికారంలోకి తేవడానికి  ఇప్పటికే బిజేపీ కి  అండగా వుండే ఆరెస్సెస్ హైద్రాబాద్ లో దిగింది. ఇక దినివైపు నుండి అకర్శితులు అవ్వడానికి చేయాల్సిన అన్ని పనులు చేస్తుంది.సంక్రాంతి తరువాత మున్సిపల్ ఎన్నికల ప్రచారంపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్న తెలంగాణ బీజేపీ… ఇందుకోసం ప్లాన్ రెడీ చేస్తోంది. పలు చోట్ల బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు కూడా వేయకపోవడంపై రాజకీయంగా చర్చ జరిగింది. దీనిపై టీఆర్ఎస్ నేతలు బీజేపీపై విమర్శలు గుప్పించారు.ఆ పార్టీకి అభ్యర్థులే లేరని కామెంట్ చేశారు.

 

ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలపై సీరియస్‌గా ఫోకస్ చేసిన బీజేపీ నేతలు… రాష్ట్రంలో పార్టీ గెలుపు అవకాశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇందుకోసం తెలంగాణ బీజేపీకి చెందిన కీలక నేతలు పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. కిషన్ రెడ్డి, మురళీధర్ రావు, ఇంద్రసేనారెడ్డి సహా పలువురు ముఖ్యనేతలు ఈ భేటీకి హాజరయ్యారు.రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లను ఏ,బీ,సీ,డీ కేటగిరీలుగా బీజేపీ విభజించింది. పార్టీ కచ్చితంగా గెలిచే స్థానాలు ఏవి ? రెండవ స్థానాల్లో నిలిచే స్థానాలు ఏవి ? పార్టీ బలహీనంగా ఉన్న స్థానాలు ఏవి ? అనే అంశంపై సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ సమావేశంలో బీజేపీ నేతలు మరో కీలకమైన అంశంపై కూడా చర్చించారని తెలుస్తోంది. తెలంగాణలోని అనేక స్థానాల్లో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులు బరిలో ఉండటంపై చర్చించిన బీజేపీ… పలు స్థానాల్లో వారికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

 

టీఆర్ఎస్‌తోపాటు ఇతర పార్టీకి చెందిన నేతలు కొందరు రెబల్స్‌గా బరిలోకి దిగడంపై చర్చించిన బీజేపీ నేతలు… తమ పార్టీ పోటీలో లేని చోట ఇతర పార్టీలకు చెందిన రెబల్స్‌కు మద్దతు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఈ జాబితాను కూడా పార్టీ నేతలు రూపొందించారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రకంగా టీఆర్ఎస్‌ను దెబ్బతీయొచ్చని బీజేపీ భావిస్తోంది.

"
"