బీజేపీ లో ”జే” టీం

ముఖ్యమంత్రి జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా ఎంతో అలోచించి తీసుకుంటారు.మూడు రాజధానుల విషయంలో కూడా అదే జరిగింది.జగన్ అన్ని సార్లు ఢిల్లీ వెళ్లినా బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ దొరకలేదు అని అందరూ పేపర్ల లో చదివే ఉంటారు.అదంతా జగనన్న స్కెచ్ అని అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ముఖ్యనాయకులు.ఒక పక్క ఢిల్లీ వెళ్లినా బీజేపీ పెద్దలు కలవడం లేదు అన్న సంతోషంలో ప్రతిపక్ష పార్టీ ఉంటే.ఢిల్లీ వెళ్లి రహస్యంగా మూడు రాజధానుల కి రాజముద్ర పడే మార్గం సుగమం చేసుకున్నారు జగన్.మూడు రాజధానుల ఆలోచన వచ్చిన వెంటనే జగన్ మొట్ట మొదటగా చేసిన పని బీజేపీ లో ఉన్న జే టీం ని మూడు రాజధానుల ప్రతిపాదనకు ఒప్పించడం.ఎన్నికల ముందు ఇరువురి ప్రత్యర్థి అయిన టిడిపిని మట్టికరిపించడానికి సహకరించిన వారిని మరోసారి రంగంలోకి దింపాలని జగన్ నిర్ణయించుకున్నారు.

 

ఈ పనులను తనకు అత్యంత సన్నిహితుడు అయిన విజయసాయిరెడ్డి కి అప్పగించారు జగన్.ఎన్నికలకు ముందు జగన్ కి బీజేపీ పెద్దల ఆశిస్సులు అందేలా చేసిన జివీల్ నరసింహరావు,సోము వీర్రాజు,విష్ణు వర్ధన్ రెడ్డి,మాధవ్ లను మరోసారి రంగంలోకి దింపారు జగన్.మూడు రాజధానులు విషయంలో జగన్ కి ఎటువంటి అడ్డంకులు ఎదురుకాకుండా కేంద్రం అన్ని విధాలా సహకరించడానికి భారీ డీల్ జరిగింది.ఈ అంశంలో సహకరించినందుకు ఒక్కొక్కరికి వెయ్యి కోట్లు లబ్ది చేకూరేలా ఒప్పందం చేసుకున్నారు.మూడు రాజధానుల నిర్మాణం లో బీజేపీ లో ఉన్న ”జే” టీం కి సింహ భాగం లాభం చేకుర్చాలి అని జగన్ ఆదేశించడం అందుకు అనుగుణంగా విజయసాయిరెడ్డి వారికీ స్పష్టమైన హామీ ఇచ్చి ఒప్పించారు.జగన్ అసెంబ్లీ లో మూడు రాజధానుల అంశం పై ప్రకటన చేయకముందే అంటే మూడు నెలల ముందు ఈ డీల్ ఢిల్లీ లో జరిగింది.వెంటనే ఈ విషయం బీజేపీ పెద్దల దృష్టికి తీసుకెళ్లి మూడు రాజధానుల అంశానికి మార్గం సుగమం చేసారు బీజేపీ లో జే టీం.అంతా సక్రమంగా జరిగిపోతుంది అనుకున్నప్పుడు మండలి లో టిడిపి బిల్లు ని సెలెక్ట్ కమిటీకి పంపడంతో కథ అడ్డం తిరిగింది.ఇప్పుడు బీజేపీ ”జే” టీం రంగంలోకి దిగింది.జగన్ ని ఈ సంక్షోభంలో నుండి బయటపడేయడానికి మరోసారి బీజేపీ జే టీం రంగంలో దిగింది.పవన్ కళ్యాణ్ ని బీజేపీ దొడ్డి లో కట్టేసి అమరావతి ఉద్యమం మరింత ఉదృతం కాకుండా చెయ్యడం లో బిజెపి జే టీం కీలక పాత్ర పోషించింది.ఇప్పుడు టిడిపి మరో కొత్త ఇరకాటం తీసుకొచ్చింది ఎంపీ గల్లా తో ప్రశ్న వేయించి అమరావతి ని ప్రభుత్వం నోటిఫై చేసింది అని కేంద్రం తోనే చెప్పించింది.ఇప్పటి వరకూ మూడు రాజధానుల అంశానికి ఆయువుపట్టు లా ఉన్న అంశం బుడగ లా పేలిపోయింది.చంద్రబాబు నోటిఫై చెయ్యలేదు అందుకే మేము వైజాగ్ కి వెళ్తున్నాం అన్న వైకాపా నాయకులు కేంద్రం ఇచ్చిన సమాధానంతో ఎం చెప్పాలో తెలియక డీలా పడ్డారు.ఇప్పుడు కూడా బీజేపీ ”జే” టీం మరో సారి జగన్ ని ఈ సమస్య నుండి గట్టెకించడానికి సిద్ధం అయ్యారు

 

.జివిఎల్ ఈ అంశం పై మాట్లాడుతూ నోటిఫై చేసినా రాజధాని మార్చుకోవచ్చు అని ప్రకటించారు.ఇప్పుడు ఈ అంశం దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కి ,బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రతిపక్షాలకు అస్త్రంగా మారనుంది.నోటిఫై అయ్యిన రాజధానులు కూడా బిజెపి మార్చుకోవచ్చు అని చెప్పడం వలన అదే అస్త్రాన్ని వాడి ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.టిడిపి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా జగన్ కి వీలైనంతగా సహాయం అందించి మూడు రాజధానుల ఏర్పాటు కి మార్గం సుగమం చేసి డీల్ క్లోజ్ చెయ్యాలి అని బీజేపీ ”జే” టీం అంటుంది

"
"