వివేకా హత్యపై బిజెపి ఫోకస్… అస‌లు నిజాలు బ‌య‌ట‌కొస్తాయా…!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ముందు జరిగిన మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో ప్రభుత్వం మారినా సరే నిందితులు ఎవరు అనేది స్పష్టత రాలేదు. ఎన్నికలకు ముందు తన బాబాయిని హత్యపై సిబిఐ కి కేసు అప్పగించాలని డిమాండ్ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్… ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అవుతున్నా సరే… ఇప్పటి వరకు ఈ హత్యపై ఒక్క ముందు అడుగు కూడా వేయలేదు. పైగా హత్య కేసుని విచారిస్తున్న అధికారులను బదిలీ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసిందనే చెప్పాలి.ఇక ఈ ఘటనపై ఎవరైనా మాట్లాడితే కేసులు పెడతామని చెప్పడం అదనం.

ఈ ఘటనలో అనేక ప్రశ్నలు ప్రజలకు ప్రశ్నలు గానే మిగిలిపోయాయి అనేది వాస్తవం. అసలు గుండెపోటు అని ఎందుకు చెప్పారు, గాయాలకు కట్లు ఎందుకు కట్టారు అనేది ఎవరికి అర్ధం కాలేదు. ఇక ఈ ఘటనలో తెలుగుదేశం హస్తం ఉందని ఆరోపించిన వైసీపీ… తమ ప్రభుత్వం ఉన్నా సరే చర్యలు తీసుకోవడం గాని నిందితులను పట్టుకోవడం గాని చేయలేదు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ఘటన మీద బిజెపి ఫోకస్ చేసినట్టు ప్రచారం జరుగుతుంది. అస‌లు నిజాలు బ‌య‌ట‌కు తీయ‌డ‌మే టార్గెట్‌గా బీజేపీ ఈ కేసును బ‌య‌ట‌కు లాగుతోంద‌ట‌.అసలు ఈ ఘటన తర్వాత, ఏమేం సంఘ‌ట‌న‌లు జరిగాయి… ఎవరి ఎవరి మీద ఆరోపణలు వచ్చాయి అనే దాని మీద కేంద్రం ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. తాజాగా ఈ హత్యపై రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ కూడా మాట్లాడారు.

ఘటన తర్వాత విచారణ చేసిన పోలీసులు ఎవరు… ఏయే అధికారులతో సిట్ ఏర్పాటు చేశారు అనే దాని మీద కూడా బిజెపి కూపీ లాగుతుంది.ఇక ఈ హత్యలో ఆరోపణలు ఎదుర్కొన్న నేతలకు ఏమైనా సంబంధం ఉందా ? అనే దాని మీద కూడా కేంద్రం విచారణ జరిపించే అవకాశం ఉందని, ప్రతీ ఒక్కటి ఈ ఘటనలో సాక్ష్యాలతో సహా… కేంద్రం ఆరా తీస్తుందని అంటున్నారు.

"
"