హైద్రాబాద్ లో ఇది పరీస్థీతి…

లంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆరేళ్లలో హైదరాబాద్‌ అభివృద్ధికి రూ.32533 కోట్లు ఖర్చు చేశామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఇటీవలే అసెంబ్లీలో ప్రకటన చేశారు. జీహెచ్‌ఎంసీ అధికారిక లెక్కల ప్రకారం రహదారుల నిర్మాణం, నిర్వహణ(వంతెనలు, అండర్‌పా్‌సలు కాకుండా)కు ఆరేళ్లలో చేసిన ఖర్చు రూ.3023 కోట్లు. కోట్లాది రూపాయలు కుమ్మరిస్తున్నా మహానగరంలోని రహదారుల పరిస్థితి మెరుగవడంలేదు. లాక్‌డౌన్‌ సమయంలో అద్దంలా మెరిసిన రోడ్లు ఇటీవల కురిసిన వర్షాల దెబ్బకు వెలవెలబోతున్నాయి. అడుగడుగునా గుంతలు, తేలిన కంకరతో వాహనాదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రమాదాలు, ప్రాణనష్టానికి కారణమవుతున్నాయి.అశాస్ర్తీయమే కారణం

జీహెచ్‌ఎంసీలో 9103 కి.మీ మేర రోడ్లున్నాయి. ఇందులో 709కి.మీ ప్రధాన రహదారుల నిర్మాణం, నిర్వహణ బాధ్యతలు ప్రైవేట్‌ ఏజెన్సీలకు అప్పగించారు. రహదారుల నిర్వహణ, నిర్మాణానికి యేటా సగటున రూ.500 కోట్లకు తగ్గకుండా జీహెచ్‌ఎంసీ ఖర్చు చేస్తోంది. అయినా రహదారుల వ్యవస్థ మెరుగుపడుతున్న దాఖలాలు లేవు. వర్షాకాలం వచ్చిందంటే నీరు నిలిచి రోడ్లు పాడవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇందులో కొంత వాస్తవం ఉన్నా.. శాస్ర్తీయ విధానంలో రోడ్లు నిర్మించక పోవడమే వరద నీరు నిలిచేందుకు ప్రధాన కారణమని ఇంజనీరింగ్‌ నిపుణులు చెబుతున్నారు. ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ (ఐఆర్‌సీ) ప్రమాణాల ప్రకారం రోడ్డు మధ్యలో ఎత్తుగా ఉండి.. పక్కలకు ఏటవాలుగా ఉండాలి. కానీ కార్పెటింగ్‌, రీ కార్పెటింగ్‌, ప్యాచ్‌ వర్క్‌ల పేరిట ఇష్టానికి బీటీ మిక్సింగ్‌ వేయడంతో చాలా ప్రాంతాల్లో ఎగుడుదిగుడుగా రహదారులు కనిపిస్తాయి. దీంతో స్ర్టామ్‌ వాటర్‌ డ్రెయిన్లు ఉన్నా వాటిలోకి వర్షపు నీరు వెళ్లే పరిస్థితి చాలా ప్రాంతాల్లో లేదు. రోడ్‌ ప్రొఫైల్‌ సరిగా లేకపోవడమూ రోడ్లు పాడవడానికి కారణమన్నది నిపుణుల అభిప్రాయం.కనీస వసతులు కరువు..

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు సంస్థలు నిర్వహిస్తున్న సర్వేల్లో మంచి ర్యాంకులు సాధిస్తున్న హైదరాబాద్‌లో రోడ్ల వ్యవస్థ మారడం లేదు. జీహెచ్‌ఎంసీకి మూడు రోజుల్లో 422 ఫిర్యాదులు రాగా.. అందులో 236 వరద నీరుకు సంబంధించి రోడ్లపై గుంతలకు సంబంధించి 106 ఫిర్యాదులున్నాయి. అందులో మెజార్టీ ప్రాంతాల్లో రహదారులు అధ్వానంగా మారాయని అధికారులు చెబుతున్నారు.పీపీఎం విఫలం

నగర రహదారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని భావించిన ప్రభుత్వం ఏం చేస్తే పరిస్థితి మెరుగవుతుందో నివేదిక ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ, ఇతర విభాగాల ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించింది. పీరియాడికల్‌ ప్రివెంటివ్‌ మెయింటినెన్స్‌ (పీపీఎం)లో భాగంగా నిర్ణీత కాల వ్యవధిలో క్రమం తప్పకుండా రహదారులు నిర్మించాలని అధికారులు సూచించారు. వారి సూచనకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో రూ.600 కోట్లకుపైగా ఖర్చు చేసి వర్షాకాలం కంటే ముందు రోడ్లు వేశారు. అయినా ఎప్పటిలానే చినుకు పడగానే రహదారులు ఛిద్ర మయ్యాయి.. పీపీఎం ప్రయోగం విఫలం కావడంతో యేడాది క్రితం ప్రైవేట్‌ ఏజెన్సీలకు రోడ్ల నిర్మాణం, నిర్వహణ అప్పగించాలని సర్కారు నిర్ణయించింది.
గ్రేటర్‌ హైదరాబాద్‌లోని 709 కి.మీ రహదారులను సమగ్ర రహదారుల నిర్వహణ కార్యక్రమం(సీఆర్‌ఎంపీ)లో భాగంగా జీహెచ్‌ఎంసీ పలు ఏజెన్సీలకు అప్పగించింది. ఐదేళ్ల కాల వ్యవధితో రూ.1687కోట్ల అంచనాతో ఏడు ప్యాకేజీలుగా పనులు అప్పగించారు. మొదటి యేడాది 50 శాతం, తరువాత రెండేళ్లలో పూర్తిస్థాయిలో రోడ్లు నిర్మించడంతోపాటు గుంతల పూడ్చివేత, ఇతర పనులూ ఆయా ఏజెన్సీలు చేయాలన్నది నిబంధన. ఫుట్‌పాత్‌ల నిర్మాణం, మ్యాన్‌హోళ్లు మరమ్మతు బాధ్యతా వారిదే. ఒప్పందం కుదిరినా ఇంకా పూర్తిస్థాయిలో ఆ ఏజెన్సీలు పనులు చేయడం లేదు. అధికారుల ఉదాసీనత వల్లే ప్రైవేట్‌కు ఇచ్చినా పరిస్థితి మారడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

"
"