సాక్షి అంతా అవాస్తవం.. ఎపీ సీయం షాకింగ్ ప్రకటన..?

సాక్షి ప‌త్రిక త‌ప్పుడు క‌థ‌నాలు రాస్తుంద‌ని, వాటిని ప‌ట్టించుకోవ‌ద్ద‌ని సాక్షాత్తు జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ముఖ్య‌మంత్రి హోదాలో అసెంబ్లీలో ప్ర‌క‌టించి త‌న మాన‌స‌పుత్రిక రాత‌ల‌కు క్రెడిబులిటీ లేద‌ని నిరూపించుకున్నారు. తాజాగా ఐటీ దాడుల ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌ను అడ్డుపెట్టుకుని అరాచ‌క‌పు రాత‌ల‌కు దిగింది సాక్షి. మాజీ ముఖ్య‌మంత్రి మాజీ పీఎస్ ఇంట్లో 2 వేల కోట్లు లెక్క‌కు దొర‌క‌ని సొమ్ముంద‌ని రాస్తూ పోయింది. వాస్త‌వంగా ఆ మాజీ పీఎస్ ఇంట్లో దొరికింది 2 ల‌క్ష‌ల 63 వేలు, 15 తులాల బంగారం.

 

అదీ త‌న కుమార్తె పెళ్లి కోసం స‌మకూర్చుకున్న సొమ్ము, న‌గ‌లు మాత్ర‌మే. పెళ్లి ఏర్పాట్ల‌లో వున్న ఆ మాజీ పీఎస్ కి న‌గ‌లు, న‌గ‌దు కూడా తిరిగి ఇచ్చేశారు. కానీ సాక్షి దాని అనుబంధ వైసీపీ బ్లూ మీడియా 2 వేల కోట్లంటూ పుంఖానుపుంఖాలుగా క‌థ‌నాలు రాసి వ‌దులుతోంది. త‌మ య‌జ‌మానే త‌మ‌ది అబ‌ద్ధాలు రాసేప‌త్రిక అని అసెంబ్లీలో బ‌ల్ల‌గుద్దీ మ‌రీ చెప్పిన ద‌య‌నీయ ప‌రిస్థితిలో తాము రాస్తే న‌మ్మ‌ర‌ని విశ్వ‌సించిన‌ సాక్షి… కొంత‌మందికి సొమ్ము ముట్ట‌జెప్పి ముచ్చ‌ట విన్నారా అంటూ అట క‌థ‌నాలతో క‌దం తొక్కిస్తోంది. మ‌రోవైపు వైసీపీ బ‌ల‌మైన పేటీఎం బ్యాచ్‌ని రంగంలోకి దింపు తెగ హ‌డావిడి చేస్తోంది.

"
"