ఏపీ క్యాబినేట్ వాయిదా.. మరోకసారి తీవ్ర ఉత్కంఠ…

వైఎస్ జగన్ తాను నిర్వహించాల్సిన క్యాబినెట్ మిటింగ్ ని ఇంకా ఏర్పాటు చేయకుండా వాయిదా వేస్తు వస్తున్నాడు. వైఎస్ జగన్  గత కోన్ని రోజులుగా తన క్యాబినేట్ ని వాయిదా వేస్తు వస్తున్నాడు.శనివారం మధ్యాహ్నం జరగాల్సి ఉన్న ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ఈ నేపథ్యంలో సోమవారమే మంత్రివర్గ భేటీ జరగనుంది. వాస్తవానికి జనవరి 20నే కేబినెట్ సమావేశం జరగాల్సి ఉంది. ఐతే ఆ సమావేశాన్ని శనివారానికి మార్చింది. కానీ అంతలోనే మళ్లీ వాయిదా వేసింది ఏపీ ప్రభుత్వం. షెడ్యూల్ ప్రకారం సోమవారమే ఉదయం 9 గంటలకు కేబినెట్ సమావేశం జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

 

సీఎం జగన్ శనివారం ఢిల్లీ వెళ్లనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.ఇక శుక్రవారం తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసులో జగన్‌తో హైపవర్ కమిటీ సమావేశమైంది. జీఎన్‌రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదికలపై పవర్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం జరిగే కేబినెట్ సమావేశంలో హైపవర్ కమిటీ నివేదిక సమర్పించనుంది. ఆ నివేదికపై మంత్రి మండలి సమావేశంలో చర్చించనున్నారు. అనంతరం అదే రోజు జరిగే అసెంబ్లీ సమావేశంలో ఏపీలో పరిపాలనా వికేంద్రీకరణ, రాజధానుల అంశంపై విస్తృతంగా చర్చ జరిగే అవకాశముంది. ఈ సమావేశాల్లోనే బిల్లును పాస్ చేయించాలనే యోచనలో ఉంది వైసీపీ ప్రభుత్వం

"
"