రియా కేస్ లో మరోక ట్వీస్ట్

రియా చక్రవర్తి విచారణలో ఎన్‌సీబీ సంచలన విషయాలను బయటపెట్టింది. విచారణలో తెలుగు నటి రకుల్ ప్రీత్ సింగ్‌, హిందీ నటి సారా అలీఖాన్‌ పేర్లు ప్రస్తావనకు వచ్చినట్లు ఎన్‌సీబీ తెలిపింది. రకుల్‌, సారా డ్రగ్స్‌ తీసుకున్నట్టు రియా చెప్పిందని ఎన్సీబీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఇందులో బాలీవుడ్‌ ప్రముఖులు కూడా ఉన్నట్లు తెలిపిన ఎన్‌సీబీ వారి లిస్టు ప్రిపేర్‌ చేయలేదని, అది ప్రిపేర్ చేశాక చెబుతామని పేర్కొంది.సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకంపై దేశ వ్యాప్తంగా పెద్ద దుమారమే లేచింది. నిన్నటి వరకు బాలీవుడ్, శాండల్‌‌వుడ్ పేర్లే వినిపించినప్పటికీ తాజాగా తెలుగు వారి పేర్లు కూడా బయటికి వస్తున్నాయి. మరింత విచారణ జరిగితే మిగిలిన ఇండస్ట్రీ వర్గాల పేర్లు కూడా బయటికి వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.అయితే కంగనా రనౌత్ చేసిన ఆరోపణల నుంచి విచారణ చేపట్టకపోవడం పట్ల ఎన్‌సీబీపై విమర్శలు గుప్పుమంటున్నాయి. బాలీవుడ్‌లో 90 శాతం మంది డ్రగ్స్ వాడుతున్నారని కంగనా ఆరోపించింది. దీనిపై దర్యాప్తు సంస్థలు ఎలాంటి ప్రకటనలూ చేయలేదు.

"
"