ఎమ్మెల్యే అనంకు అనీల్ కుమార్ షాకింగ్ రిప్లై.. సొంత పార్టీ ఎమ్మెల్యేను అంత మాట అనేసాడేంటి

ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యలు వైసీపీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై తాజాగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సీఎం పెద్దపీట వేస్తున్నారని అనిల్ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఎలాంటి అవినీతికి తావు లేకుండా పాలన సాగుతోందని ఆయన తెలిపారు. వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక ఎలాంటి మాఫియాకు అవకాశం లేదన్నారు. అయితే ఆనం వ్యాఖ్యలపై స్పందించాలని మీడియా ప్రతినిధులు కోరగా.. ఆయన్నే వివరణ అడగాలని అనిల్ బదులిచ్చారు.

మొత్తానికి చూస్తే.. ఆనం మాట్లాడిన శాంతి భద్రతలు, మాఫియా మాటలపై అనిల్ పరోక్షంగా పై విధంగా రియాక్ట్ అయ్యారు. కాగా ఇవాళ నెల్లూరు జిల్లాకు చెందిన కీలకనేత బీద మస్తాన్ రావు వైసీపీలో చేరిక అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి అనిల్ పై వ్యాఖ్యలు చేశారు.సొంత పార్టీకి చెందిన మంత్రి అనిల్‌కుమార్‌, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలపై మాటలదాడికి దిగారు. అయితే వారి పేరెత్తకుండా నెల్లూరు నగరంలో శాంతిభద్రతలపై విమర్శలు గుప్పించారు. వ్యవస్థలు తమ పని తాము చేసుకుని వెళ్లే పరిస్థితి నగరంలో లేదని.. మాఫియా ముఠాల ఆగడాలపై ఎవరికి చెప్పుకోవాలో తెలియక లక్షలాది మంది నగరవాసులు కుమిలిపోతున్నారని రామనారాయణరెడ్డి చెప్పిన విషయం తెలిసిందే.

"
"