ఏపీ మంత్రి మరో సంచలనం… తెరపైకి నాలుగో రాజధాని

ఏపీ ఇప్పుడు అత్యంత దారుణమైన పరీస్థితిని ఏదుర్కుంటుంది.  ఏది రాజధానో తేలియక ప్రజలంతా తీవ్ర ఉత్కంఠలో వున్నారు. ఇక ఇలాంటి సమయంలోనే చాలా మంది నేతలు రాజధాని మాకు కావాలంటే మాకు కావాలని అధిష్టానానికి  చేప్పడం అలాగే బహిరంగ   మాట్లాడటం.  రాజధానిపై  ఒక వివిధ  ప్రాంతాలకు చెందిన వ్యక్తులు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు కాదని, నాలుగు రాజధానులు ఉండాలని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు కోరారు. ఈ విషయాన్ని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళతానని చెప్పారు.

 

వైఎస్ జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని సమర్థిస్తూ రాజమండ్రిలో వైసీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రాజమండ్రిలో పర్యటిస్తున్న రోజే వైసీపీ నేతలు కూడా భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీరంగనాథ రాజు మాట్లాడుతూ.. ‘ఏపీకి మూడు కాదు. నాలుగు రాజధానులు కావాలి. రాజమండ్రిని సాంస్కృతిక రాజధానిగా ప్రకటించాలి. ఆది కవి నన్నయ, సంఘ సంస్కర్త వీరేశలింగం వంటి వారు ఇక్కడి నుంచే వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో కళలు, సంస్కృతి అంటే రాజమండ్రే గుర్తుకు వస్తుంది. కాబట్టి, రాజమండ్రిని సాంస్కృతిక రాజధాని చేయాలని సీఎం జగన్‌ను కోరతా. వచ్చే కేబినెట్ సమావేశంలో ఈ విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళతా. ఉభయ గోదావరి జిల్లాలకు కూడా మేలు జరుగుతుంది.’ అని అన్నారు.

"
"