సైలెంట్ గా ప్లేట్ మార్చిన వైసీపీ ఏమ్మెల్యే అనం

అనం రామనారాయణ రెడ్డి  అయన ఏలాంటి సంచలన వ్యాఖ్యలు చేశాడో అందరికి తెలిసిందే. అయన ఏకంగా జిల్లా స్థాయిలోని వైసీపీ నెతలందరిని అందులో  ఇన్వాల్ చేశాడు. ఇక దినితో  ఒక్కసారిగా వైసీపీ నెతలంతా షాక్ అయ్యారు. ఇక అయన అలాంటి కామెంట్ ఎందుకు చేయాల్సీ వచ్చిందో అని అందరూ  లెక్కలు వేశారు.నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి విషయం వైసీపీలో తీవ్ర దుమారం రేపింది. నెల్లూరు జిల్లాలో మాఫియా రాజ్యం ఏలుతోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. మాఫియాలు, కబ్జాకోరులు, బెట్టింగ్ రాయుళ్లు ఎక్కువైపోయారని.. లిక్కర్, బెట్టింగ్, లాండ్, శాండ్, ఏ మాఫియా కావాలన్నా నెల్లూరు వస్తే దొరుతుకుందన్నారు. కొంతమంది మాఫియా గ్యాంగ్‌లు, గ్యాంగ్‌స్టర్‌లకు నెల్లూరును అప్పగించారని బయటకు చెప్పుకోలేక ప్రజలు కుమిలిపోతున్నారని వ్యాఖ్యానించారు. దీనిపై పెద్ద దుమారం రేగింది.

జిల్లాకు చెందిన మంత్రి అనిల్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది.ఆనం ఆరోపణల మీద స్పందించిన జగన్.. ఆయనకు షోకాజ్ నోటీస్ ఇవ్వాలని ఎంపీ విజయసాయిరెడ్డిని ఆదేశించారు. ఈ క్రమంలో నేడో, రేపో ఆనం మీద చర్యలు తప్పవనే ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు ఆనం తన చాతుర్యాన్ని ప్రదర్శించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో సభ సాక్షిగా తన టాలెంట్ చూపారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా టీడీపీ సభ్యులు సభలో నిరసన తెలిపారు. చర్చలో తమ వాదన వినిపించేందుకు అవకాశం ఇవ్వాలంటూ, చంద్రబాబు మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఈ సందర్భంగా స్పందించిన ఆనం రామనారాయణరెడ్డి ప్రశ్నోత్తరాల్లో చర్చకు ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చే సంప్రదాయం లేదని ఓ లాజిక్ బయటపెట్టారు. దీంతోపాటు ‘సభలో అరాచకశక్తులు’ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆనం ఖండించారు. సభలో తన సీటు వద్దకు చంద్రబాబు రావడానికి ప్రయత్నించడాన్ని ఆనం తప్పుపట్టారు. ప్రతిపక్ష పార్టీ సభ్యులు తన సీటు వద్దకు వస్తున్నారని తన సీటు మార్చాల్సిందిగా స్పీకర్‌ను కోరారు.

వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నా, అసెంబ్లీలో విపక్షాలను ఇరుకున పెట్టడానికి, సభా సంప్రదాయాలు తెలిసిన తనలాంటి సీనియర్ల అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా ఆనం చెప్పకనే చెప్పారు. తనకు వైసీపీ షోకాజ్ నోటీస్ ఇస్తుందని తెలిసినా కూడా జగన్‌కు మద్దతుగా, అసెంబ్లీల ఎవరూ ఊహించని విధంగా స్పందించారు. ఇప్పుడు ఆనం మీద వేటు వేస్తే.. మంచి లీడర్‌ను పోగొట్టుకున్నారనే నింద జగన్ మీద పడుతుంది. ఒకవేళ వదిలేస్తే.. మళ్లీ ఆనం రామనారాయణరెడ్డి మరో బాంబు పేల్చరన్న గ్యారెంటీ లేదు. దీంతో జగన్ ఇరకాటంలో పడ్డారు.

"
"