అమరావతిలో పరీస్థీతి ఏలా వుందంటే…

ఏపీలో రాజధాని రగడ రోజు రోజుకు పేరుగుతూనే వుంది. తాజాగా  అక్కడ వున్న రూల్స్ చూస్తే ఇది మన అమరావతి రాజధాని ప్రాంతం లాగా లేదు. ఏదో యుద్దం జరుగుతున్నట్టు వుంది.సీఎం జగన్‌ సచివాలయానికి వచ్చిన ప్రతిసారీ మందడంలో సకలం బంద్‌ అవుతోంది. తాము రోడ్లపై తిరగకుండా పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం సచివాలయానికి వస్తున్న నేపథ్యంలో మందడం ప్రధాన రహదారిని పోలీసులు మంగళవారం తమ అధీనంలో ఉంచుకున్నారు. జగన్‌ వచ్చి వెళ్లే వరకు షాపులు తెరుచుకోలేదు.

 

ఇక్కడి ప్రధాన రహదారిలో మూడంచెల బందోబస్తును నిర్వహిస్తున్నారు. ఐడీ కార్డు, ఆధార్‌ కార్డు తనిఖీ చేశాకే సచివాలయంలోకి పంపుతున్నారు. ప్రధాన రాహదారి వెంట ఉన్న దుకాణాలు పూర్తిగా మూసివేయిస్తున్నారు. మెడికల్‌ షాపులకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. ఇక్కడి లింకురోడ్డులో ఇనుప కంచె, బారికేడ్లు ఏర్పాటుచేసి గ్రామస్థులు ఎవరినీ ఆ రోడ్డులోకి కూడా రానివ్వడం లేదు. బయట అరుగుల మీద కూడా కూర్చోవడానికి వీలులేదంటూ రైతులను ఇళ్లలోకి పంపేస్తున్నారు. సీఎం సచివాలయానికి వెళ్లిన తర్వాతే భోజనాలు చేయమని చెబుతున్నారు.

"
"