వైఎస్ జగన్ , అచ్చెంనాయుడు మధ్య అసక్తిగల సంఘటన…

రాజకీయ నాయకులు మామూలుగా  వుంటే మంచిగానే వుంటారని ఇక వాళ్ళ మధ్య గల సంభందాలు కూడా చాలా మంచిగా వుంటాయని చాలా సార్లు నిరూపితం అయిన విషయం తెలిసిందే. ఇక మరోకసారి పార్టీల  పరంగా, ప్రజల పరంగా బద్ద శత్రువులుగా వుండే నెతలు  వైఎస్ జగన్,  కింజారపూ అచ్చెంనాయుడు వాళ్ళ  మధ్య జరిగిన మరోక ఇక వాళ్ళ మధ్య ఏలాంటి సంధర్భాలు వుంటాయో మరోకసారి నిరూపించారు. ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయాలు ఎలా నడుస్తున్నాయో వేరేగా చెప్పనెక్కర్లేదు.రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న స్థాయిలో ఉంటుంది.

ఇక టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడు వీలు దొరికినప్పుడల్లా జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టుందుకు ప్రయత్నిస్తుంటారు. అటు జగన్ కూడా అచ్చెన్నాయుడుపై అనేక సందర్భాల్లో విమర్శలు వేస్తూ… ఎద్దేవా చేశారు. గతంలో నిండు సభలో ‘ఏయ్ అచ్చెం కూర్చో’ అంటూ సీరియస్‌గా మందలించారు. అయితే అలాంటి ఇద్దరు నేతలు కలిసి అప్యాయంగా మాట్లాడుకుంటే…ఎలా ఉంటుంది. వినడానికి ఇది ఎంతో ఆశ్యర్యంగా ఉన్నా ఇది నిజం.బీఏసీ సమావేశంలో ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అచ్చెన్నాయుడు ఇటీవలే కారు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆయనకు గాయాలయ్యాయి. అయితే ఇదే విషయమై అచ్చెన్నాయుడు పరామర్శించారు జగన్. చేతికి ఉన్న గాయం చూసి తగ్గిందా అని అప్యాయంగా అడిగారు సీఎం. దీంతో ప్రమాదం జరిగిన తీరును జగన్‌కు వివరించారు అచ్చెంనాయుడు.

దీనిపై కలగజేసుకున్న చీఫ్ విప్ శ్రీకాత్ రెడ్డి మాట్లాడుతూ మా సీఎం మీ గురించి ఎంత ప్రేమగా ఆడిగారో చూడండి అంటూ వ్యాఖ్యానించారు. శ్రీకాంత్ రెడ్డి మాటలకు స్పందిస్తూ ‘నాకూ – జగన్ కు వ్యక్తిగతం గా ఏముంటుంది’ అని వ్యాఖ్యానించిన అచెన్న. మాది వేరే పార్టీ మీది వేరే పార్టీ అనే దూరం మినహా కోపం ఏముంటుంది అన్నారు అచ్చెన్నాయుడు.

"
"