అచ్చెన్నకు కరోనా… షాక్ లో టీడీపీ నేతలు…

మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్యింది. జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉన్న అచ్చెన్నకు స్థానికంగా ఉన్న రమేష్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాల్లోకెళితే.. నిన్న ఉదయం నుంచి జలుబు చేయటంతో అచ్చెన్నకు కరోనా పరీక్షలు నిర్వహించగా ఇవాళ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఆయనకు పాజిటివ్ రావడంతో హైకోర్ట్‌కు లేఖ రాయాలని నిర్ణయించారు. అచ్చెన్న ఆరోగ్య పరిస్థితిపై ప్రతివారం ఆస్పత్రి హైకోర్ట్‌కు బులెటిన్ ఇస్తున్నది.

కాగా ప్రస్తుతం అచ్చెన్నాయుడుకు రమేష్‌ ఆస్పత్రి వైద్యులు కరోనా చికిత్స అందిస్తున్నారు.అచ్చెన్నకు పాజిటివ్ రావడంతో కుటుంబీకులు, అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు ఆందోళన చెందుతున్నారు.కాగా.. ఈఎస్‌ఐ మందుల కొనుగోలులో అవకతవకలు జరిగాయని అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జూన్-12న అచ్చెన్న స్వగ్రామం నిమ్మాడలో అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ హయాంలో అచ్చెన్నాయుడు కార్మికశాఖ మంత్రిగా ఉన్నారు. ఇప్పటికే కొంత మంది అధికారులను కూడా అదుపులోకి తీసుకున్నారు.

"
"