మంత్రి పదవి ఆశించా.. జగన్ అంతకు మించిందే ఇచ్చాడు..

నేను ఓకటి అశించాను. కాని మీరు నా కన్నా ఉన్నతంగా అలోచించారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని ప్రశంసలతో ముంచేత్తాడు. ఆ వైసీపీ నేత తనకు ఇచ్చి న అవకాశంన్ని కచ్చితంగా సద్వినియోగం చేసుకుంటానని, ఏవరీకి ఏ లొటు రానివ్వకుండా చుసుకుంటానని తెలిపాడు.ఇంతకి దేని గురించి మాట్లాడేది అంటే. టీటీడీ బొర్డ్ మెంబర్లలో ఒకరీగా ఏంపికైన ఎలమంచిలి ఎమ్మెల్యే ఉప్పలపాటి వెంకటరమణమూర్తిరాజు గురించి తనకు ఇచ్చిన ఈ అవకాశన్ని దుర్వీనీయేగం కానివ్వననీ తెలిపాడు

కలియుగదైవం శ్రీవెంకటేశ్వరస్వామికి సేవ చేసే అదృష్టం తనకు లభించడం పూర్వజన్మ సుకృతమని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యునిగా నియమితులైన ఎలమంచిలి ఎమ్మెల్యే ఉప్పలపాటి వెంకటరమణమూర్తిరాజు పేర్కొన్నారు. బుధవారం రాత్రి ఆయన  మాట్లాడుతూ టీటీడీ బోర్డులో తనకు స్థానం దక్కడం జగన్‌ ఇచ్చిన వరంగా భావిస్తున్నానన్నారు. తనకు వెంకటేశ్వరస్వామి అంటే అమితమైన భక్తి అని, ప్రతినెలా ఒకసారి స్వామి దర్శనం చేసుకుంటానన్నారు.స్వామి దర్శనం చేసుకుంటే నాలుగైదు రోజులపాటు అదే ఆధ్యాత్మిక భావనలో వుండి మనస్సు ప్రశాంతంగా ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలో సీనియర్‌ ఎమ్మెల్యేను కాబట్టి మంత్రి పదవి వస్తుందని భావించానని, అయితే ఇప్పుడు అంతకంటే ఉన్నతమైన పదవి దక్కిందని సంతోషం వ్యక్తంచేశారు.

గడిచిన ఎనిమిదేళ్లలో వేల మందికి స్వామి దర్శనం చేయించానని, ఇప్పుడు ఉత్తరాంధ్రలో సామాన్యుడు కూడా స్వామిని దర్శించుకుని ముక్తి పొందేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. తనకు టీటీడీ బోర్డు సభ్యుడిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటానన్నారు.

"
"