జ‌గ‌న్ బాబాయ్‌ని ఒంట‌రిని చేసేశారా…!

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి శ్రీవారు కొలువున్న పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూ వివాదాలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. మొదట్లో టీటీడీ బస్సుల్లో ఆర్టీసీ టికెట్లపై జెరుసలెం యాత్ర గురించి ప్రచారం దగ్గర నుంచి తాజాగా టీడీపీ అధికారిక వెబ్ సైట్ లో ‘యేసయ్య’ అనే పదం వచ్చే వరకు వివాదాలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ వివాదాలు ఎలా వస్తున్న వివరణ ఇచ్చే విషయంలో టీటీడీ ఛైర్మన్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డికి పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ఆయనకు వైసీపీ కూడా సపోర్ట్ ఇవ్వకపోవడంతో ఆయనకు మరిన్ని కష్టాలు పెరిగాయి.సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్ అవ్వడమే వివాదంతో మొదలైంది.

ఆయన ప్రొఫైల్ లో మతం క్రిస్టియన్ అని ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే తను క్రిస్టియన్ కాదు పక్కా హిందువు అని నిరూపించుకోవడానికి చాలా కష్టాలే పడ్డారు. ఇక దీని తర్వాత టీటీడీ బస్సులో ఇచ్చే టికెట్లపై జెరూసలేం యాత్రకు సంబంధించిన ప్రచారం జరిగింది. అయితే ఈ టికెట్లు ఎప్పుడో ప్రింట్ చేసినవని తమ ప్రభుత్వ హయాంలోవి కాదని సుబ్బారెడ్డి వివరణ ఇవ్వలేక నానా ఇబ్బందులు పడ్డారు.అలాగే ఇటీవల శ్రీవారి లడ్డు ప్రసాదం రేటు పెంచడం, అద్దె రూముల ధరలు పెంచడం అదే సమయంలో మక్కా, జెరూసలేం యాత్రకు వెళ్ళేవారికి ప్రభుత్వం చేసే ఆర్ధిక సాయం మరింత పెంచడం పట్ల కూడా వివాదం చెలరేగింది. ఇక తాజాగా టీటీడీ అధికారిక వెబ్ సైట్ లో శ్రీ యేసయ్య అనే పదం రావడంతో హిందువులు సోషల్ మీడియాలో దీనిని ప్రచారం చేశారు.

ఇక ప్రముఖ దినపత్రికలు దీనిపై కథనాలు రాశారు. దీంతో సుబ్బారెడ్డి ఎలాగోలా వివరణ ఇచ్చారు. అది గూగుల్ తప్పని, మాది కాదని చెప్పుకునే ప్రయత్నం చేశారు. అయితే ఎన్ని వివాదాలు వచ్చిన సుబ్బారెడ్డికి వైసీపీ సపోర్ట్ లేకుండా పోయింది. దాని వల్ల సుబ్బారెడ్డి ఒంటరి అయిపోయారనే భావన కలుగుతుంది. ఆయన ఒంటరైన అది వైసీపీకు కూడా డ్యామేజ్ అవుతుంది.