వైసీపీలోకి వెళ్తే ఏం జరుగుతుందో అర్థం అయిందా..? బొండా ఉమ రివర్స్ గేర్ వెనుక అసలు కథ..!

దాదాపుగా వైసీపీలోకి వెళ్లడానికి రెడీ అయిపోయిన బొండా ఉమ.. ఎందుకు మనసు మార్చుకున్నారన్నదానిపై ఆసక్తికరమైన చర్చ విజయవాడలో సాగుతోంది. ఆయన సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జ్ పదవిని మాత్రమే పట్టుబట్టారు. అయితే అక్కడ మల్లాది విష్ణు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తూర్పు నియోజకవర్గంలో… వైసీపీ తరపున మూడు, నాలుగు వర్గాలున్నాయి. ఎలా చూసినా.. తనకు.. వైసీపీలో… ప్రాధాన్యం దక్కదని ఆయన భావించినట్లు చెబుతున్నారు.

అదే సమయంలో.. తెలుగు యువత అధ్యక్షుడు అవినాష్ ను.. కూడా పార్టీలోకి ఆహ్వానించారని.. ఆయనకూ విజయవాడ తీర్పు సీటునే ఆఫర్ చేశారని ప్రచారం జరిగింది.దాంతో తన రాజకీయ భవిష్యత్ కు టెండర్ పెట్టేలా.. ఏ పార్టీకి కాకుండా చేసే ప్రయత్నమేదో జరుగుతోదని… బొండా ఉమ అంచనాకు వచ్చారంటున్నారు. గతంలో టీడీపీలో ఉన్న యలమంచిలి రవికి ఎదురైన పరిస్థితే తనకు ఎదురువుతుందని.. టీడీపీలో ఉంటేనే బెటరనుకున్నట్లుగా… ఆయన వర్గీయులు చెబుతున్నారు. అదే సమయంలో… ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే సెంట్రల్ నియోజకవర్గ కార్పొరేటర్ సీట్లలో.. టీడీపీకే అత్యధిక వార్డుల్లో మెజార్టీ వచ్చింది. అందుకే ద్వితీయ శ్రేణి నేతలు కూడా టీడీపీలోనే ఉండేందుకు మొగ్గు చూపడంతో.. బొండా ఉమ మనసు మార్చుకున్నారు.సోమవారం సాయంత్రం చంద్రబాబును కలిశారు. ఆ తర్వాత పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనకు వైసీపీ నుంచి మాత్రమే కాదని.. అన్ని పార్టీల నుంచి ఆహ్వానం అందిందని ప్రకటించుకున్నారు. తాను దేశంలో లేని సమయమంలో… పార్టీ మార్పుపై ప్రచారం చేశారని.. అదంతా అవాస్తవమేననంటున్నారు. పార్టీ మరేవాడిని ఐతే అధినేత దగ్గరికి ఎందుకు వస్తానని మీడియాను ఆయన ఎదురు ప్రశ్నించారు. పార్టీ ని బలోపేతం తన వంతు పాత్ర పోషిస్తానని చెప్పుకొచ్చారు.