వైసీపీ కార్యకర్తలకే వందశాతం రిజర్వేషన్లు..! జగన్‌ని మరోసారి బుక్ చేసిన విజయసాయి..!

దొడ్డిదోవన.. గ్రామ వాలంటీర్లందర్నీ … వైసీపీ కార్యకర్తలనే నియమిస్తున్నామని.. విజయసాయిరెడ్డి నేరుగానే ప్రకటించారు. నిజానికి కొద్ది రోజులుగా.. వాలంటీర్ల నియామక ప్రక్రియపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఒక సామాజికవర్గానికే… అదీ వైసీపీ కార్యకర్తలకే నియామక పత్రాలు ఇస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. కానీ ఎవరూ పట్టించుకోలేదు. అందరి నియామకాలను పూర్తి చేశారు. అన్ని చోట్లా.. వైసీపీ నేతలు ఇచ్చిన జాబితా ప్రకారమే నియామకాలు పూర్తయ్యాయని చెబుతున్నారు.అసలు దరఖాస్తు చేసుకోని వారు పెద్ద ఎత్తున నియామక పత్రాలు పొందారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

దీనిపై ప్రభుత్వ విధానమే వేరుగా ఉందని.. విజయసాయిరెడ్డి మాటల్లో స్పష్టమయింది. విజయసాయిరెడ్డి వీడియో ఇప్పుడు వైరల్ అయింది. మెరిట్ ప్రకారం కాకుండా.. ఇంటర్యూలు ద్వారానే.. నియామకాలు చేయడంతో.. అక్రమాలకు కారణం అయింది. ఈ నియామకాలపై కోర్టులకు వెళ్లేందుకు.. విజయసాయిరెడ్డి వీడియో ఉపయోగపడే అవకాశం కనిపిస్తోంది. గ్రామవాలంటీర్ పోస్టుకు అర్హతలు… పదో తరగతి నుంచి ప్రాంతాన్ని బట్టి డిగ్రీ వరకు నిర్ణయించారు. అయితే.. అది రికార్డుల కోసమే.. ప్రజలను ఫూల్స్ చేయడానికే. అసలు అర్హత మాత్రం… వైసీపీ కార్యకర్త అవునా..? కాదా..? అన్నది మాత్రమే చూశారట. ఈ విషయాన్ని ఎవరో సాదాసీదా వ్యక్తి చెబితే.. పట్టించుకోవాల్సిన పని లేదు కానీ..ఈ గ్రామ వాలంటీర్ వ్యవస్థను… కనుసైగలతో… శాసిస్తున్న… వైసీపీ… నెంబర్ టూ విజయసాయిరెడ్డినే చెప్పారు.

పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలతో జరిగిన ఓ సమావేశంలో.. ఈ మేరకు.. విజయసాయిరెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో.. వైసీపీ కార్యకర్తలకు రిజర్వేషన్లు కావాలని.. కొంత మంది… అడిగారు. అయితే.. ఇలా ఇస్తే కోర్టులు కొట్టి వేస్తాయి కాబట్టి… మరో దారిలో… వైసీపీ కార్యకర్తలకే ఉద్యోగాలిస్తున్నట్లుగా విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. దీనిపై.. నిరుద్యోగులు కోర్టుకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.