వైసీపీకి బిగ్ షాక్.. ఇసుకపై జగన్ కు మరో దెబ్బేసిన టీడీపీ

వైఎస్ జగన్ సీయం అయినప్పటి నుండి సంచలన నిర్ణయాలు తీసుకుంటు ముందుకు వేళ్తున్నాడు. అదికాకుండా అయన తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయం ప్రజల మెప్పు కోసమే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆయన ఒక్క విషయంలో మాత్రం బాగా విమర్శలు ఎదురుకుంటూన్నాడు. అదే ఇసుక కోరత.వైసీపీ పార్టీ అధినేత మరియు ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక గతంలో ఇది వరకు ఎన్నడూ లేని విధంగా ఇసుక కొరత ఏర్పడడం అలాగే దాని మూలంగా భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం వంటివి జరగలేదన్న సంగతి అందరికి తెలిసిందే.

కానీ దీనిని వైసీపీ ఎంత కప్పిపుచ్చి ఉంచుదామనుకున్నా బయటకు బాగానే ప్రచారం జరిగిపోయింది.అయితే ఈ సమస్య తీవ్ర రూపం దాల్చడం ప్రతిపక్ష పార్టీలు గట్టిగా పోరాడుతుండడంతో జగన్ ఇసుక వారోత్సవాల పేరిట ముందులానే ఇసుకను నిర్మాణ కార్మికులకు అందుబాటులోకి తీసుకొని రావడానికి ఆదేశాలు జారీ చేసారు.ఇదిలా ఉండగా దీని వెనుక కూడా జగన్ దోపిడీ ఉందని తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం షాకిచ్చింది.”ఇసుక వారోత్సవాల పేరిట ప్రజల ఇసుక అవసరాలను క్యాష్ చేసుకుంటోంది. ప్రభుత్వమే ఒక్కో చోట ఒక్కొక్క రేటు నిర్ణయించి దోచుకుంటోంది. పోనీ ఇసుక అక్రమ దందా తగ్గిందా అంటే అదీ లేదు. ఏపీఎండీసీ వెబ్‌సైట్‌ నుంచి నకిలీ ఐడీతో తెచ్చుకోవడం, బ్లాక్ లో అమ్ముకోవడం షరా మామూలే. ఇందుకేనా వారోత్సవాలు?” అంటూ సంచలనాత్మక ట్వీట్ ఒకటి పెట్టి వైసీపీ వైఫల్యాన్ని మరోసారి ఎండగట్టింది.మరి దీనికి వైసీపీ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి.