వివేకా మృతిపై అనుమానాలు.. రక్తపు మడుగులో.. చేతికి, తలకు గాయాలు

వైసీపీ అధినేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. తెల్లవారుజామున బాత్‌రూమ్‌లో కుప్పకూలి ఉండగా కుటుంబ సభ్యులు గుర్తించినట్లు తెలిసింది. ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నించినప్పటికీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు సమాచారం. ఇటీవల గుండెపోటు రావడంతో వైఎస్ వివేకా స్టెంట్ వేయించుకున్నారు.

అయితే వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆయన పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పీఏ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. రక్తపు మడుగులో పడి ఉండటం, తల, చెయ్యికి బలమైన గాయాలు కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు డాగ్ స్వ్కాడ్‌ను రంగంలోకి దించారు. వివేకానందరెడ్డి మృతదేహానికి పోస్ట్‌మార్టం జరుగుతోంది.

పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఏముందోనన్న ఆందోళన ఆయన అనుచరుల్లో వ్యక్తమవుతోంది. బాత్రూంలో వైఎస్ వివేకానందరెడ్డి రక్తపు మడుగులో పడి ఉండటాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. అయితే.. అప్పటికే ఆయన మృతి చెందారు.