జగన్ కు బిగ్ షాక్.. వైసీపీకి ప్రముఖ వ్యక్తి గుడ్ బై..!

వైసీపీ అధికారంలోకి వచ్చి కేవలం కొన్ని రోజులే అయ్యింది. కానీ వైసీపీకి అప్పుడె వైసీపీ మధ్ధత్తు దారులు తమ అసంతృప్తీని బహిరంగంగానే వెళ్లబుచ్చుతున్నారు. వైసీపీ కి వచ్చి జగన్ కి అండగా వుండి, కష్టాల సమయంలో కూడా తోడుగా వున్నా కూడా వైఎస్ జగన్ అతడికి మోండిచేయ్యి చూపించడం అసక్తి రేపింది.ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. జగన్ కూడా తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నాడు. పాలనలో కూడా దూకుడు చూపిస్తున్నాడు. ఇక ఈయన సినిమా వాళ్లకు కూడా మంచి ప్రాధాన్యమే ఇస్తున్నాడు. ముఖ్యంగా తనతో పాటు పార్టీ ఆరంభం నుంచి పని చేసిన వాళ్లను గుర్తు పెట్టుకుని మరీ వాళ్లకు కీలక పదవులు కట్టబెడుతున్నాడు సీఎం జగన్. కానీ కొందరికి మాత్రం మొండిచేయి చూపించడంతో సీనియర్లు బాధ పడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

ఇప్పటికే వైసీపీలో ఉన్న పృథ్వీ, విజయ చందర్, రోజా లాంటి వాళ్లకు పిలిచి మరీ పదవులు ఇచ్చాడు జగన్.ఇలాంటి సమయంలో మరికొందరు మాత్రం పార్టీలోకి తాము వచ్చిన తర్వాత కూడా పట్టించుకోవడం లేదని అసంతృప్తిలో ఉన్నారని తెలుస్తుంది. అందరికంటే ఓ ప్రముఖ సినీ నటుడు మాత్రం జగన్ తీరుపై చాలా అసంతృప్తితో ఉన్నాడని తెలుస్తుంది. ఎన్నికలకు ముందు భారీ ఆశలతో తెలుగుదేశం, జనసేన లాంటి పార్టీ ఆఫర్స్ కూడా కాదనుకుని వైసీపీలోకి వచ్చాడు ఆయన. జగన్ కూడా ముందు మీరు రండి.. వచ్చిన తర్వాత మీకు నామినేటెడ్ పదవి ఖాయం అని మాటిచ్చినట్లు వైసీపీ వర్గాలే చెబుతున్నాయి.కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు తనవైపు చూడకపోవడం.. తనను కాదని పార్టీలో ఇతరులకు పదవులు ఇవ్వడంతో ఆ నటుడు బాగా ఫీలయ్యాడని ప్రచారం జరుగుతుంది. అందుకే జగన్ పార్టీని వీడే ఆలోచనలో కూడా ఉన్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్న మాట. వైసీపీలో మరికొందరు సినిమా వాళ్లు కూడా జగన్ తీరుపై కాస్త అసంతృప్తితో ఉన్నారని తెలుస్తుంది. పోసాని లాంటి వాళ్లైతే నేరుగానే బయటపడినా.. కొందరు మాత్రం బయట పడలేకపోతున్నారు.ఇదిలా ఉంటే ఈ ప్రముఖ నటుడు మాత్రం తనకు మంత్రి పదవి ఖాయం అని.. వచ్చి ఆ కోటాలో ప్రజలకు సేవ చేద్దామనుకుంటే మోసం చేసాడని బాగా ఫీల్ అవుతున్నట్లు వార్తలొస్తున్నాయి.

అందుకే కర్ణాటక బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసిన ఓ ప్రముఖ సినీ హీరో.. తన స్నేహితుడి రాయబారంతో కమలం పార్టీలోకి వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. మొత్తానికి ఏదేమైనా కూడా జగన్ మాత్రం ఎన్నికల ముందు వచ్చిన వాళ్లకు కాకుండా తనతో పార్టీ పెట్టిన రోజు నుంచి ఉన్నవాళ్లకే పదవులు ఇస్తున్నాడు. ఇది కొందరికి నచ్చుతుంది.. మరికొందరికి నచ్చట్లేదంటున్నాయి వైసీపీ వర్గాలు.