బీజేపీ ఎఫెక్ట్.. ఏపీలో వ్యూహం మార్చిన జగన్

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయినప్పడు బాగానే వుంది. అతడు ఎమ్మెల్యెలు పార్టీ మార్పుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. జగన్ తీసుకున్న నిర్ణయాలు అటు వైసీపీ నాయకులను,ఇటు పార్టీ కార్యకర్తలు చాలా అనందపడ్డారు. కానీ ఇప్పుడు వైఎస్ జగన చేస్తున్న పనికి వైసీపీ కార్యకర్తలకు అనందం ఎన్నో రోజులు లెకుండా పోయింది. ఇక ఇప్పుడ్యు జగన్ చేస్తున్న పనికి అడ్డు చెప్పెలేక కార్యకర్తలు చాలా అసహనానికి గురవుతున్నారు.ఆభారీగా ఎమ్మెల్యేలు, తనను నమ్ముకున్న నేతలు ఉన్నా కూడా కొత్తగా ఇతర పార్టీల నుంచి వలసలను ఎందుకు ప్రోత్సహించాల్సి వచ్చిందనే ప్రశ్న వైసీపీ నేతల్లో వినిపిస్తోంది. ంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ విషయంలో మనసు మార్చుకున్నారు. రాష్ట్రంలో బీజేపీని చూసిన తర్వాత ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరఫున 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వారితోపాటు పార్టీలో చాలా కాలం నుంచి పనిచేస్తున్న నేతలు కూడా చాలా మందే ఉన్నారు.

దీంతో ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహించకూడదని జగన్ మోహన్ రెడ్డి గతంలో నిర్ణయం తీసుకున్నారు.టీడీపీ తరహాలో ప్రజాప్రతినిధులతో రాజీనామాలు చేయించకుండా పార్టీలోకి తీసుకోకూడదని బలంగా నిర్ణయించుకుని, ఆ విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల తర్వాత ఇప్పుడు వలసలు ప్రారంభమయ్యాయి. కొన్ని రోజుల క్రితం తోట త్రిమూర్తులను వైసీపీలోకి తీసుకున్నారు. తాజాగా టీడీపీ నుంచి జూపూడి ప్రభాకర్ రావు, జనసేన నుంచి ఆకుల సత్యనారాయణను వైసీపీలో చేర్చుకున్నారు.ఎన్నికల్లో ఘనవిజయంతో భారీగా ఎమ్మెల్యేలు, తనను నమ్ముకున్న నేతలు, ఇంతమంది ఉన్నా కూడా ఇప్పుడు కొత్తగా ఇతర పార్టీల నుంచి వలసలను ఎందుకు ప్రోత్సహించాల్సి వచ్చిందనే ప్రశ్న వైసీపీ నేతల్లో వినిపిస్తోంది. అయితే, వైసీపీ వైఖరి వల్ల రాష్ట్రంలో బీజేపీ బలపడే అవకాశం ఉందని, టీడీపీ కంటే బీజేపీతో డేంజర్ అన్న భావనతోనే జగన్ మోహన్ రెడ్డి తాజాగా చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వారు, గెలిచే సత్తా ఉన్న నేతలకు గేట్లు మూసేస్తే.. భవిష్యత్తులో వారంతా బీజేపీలో చేరే చాన్స్ ఉంది. దాని వల్ల వైసీపీకి ఇబ్బంది తప్పదు. మడికట్టుకుని కూర్చుంటే మొదటికే మోసం వస్తుందని భావించిన జగన్ మోహన్ రెడ్డి తన వైఖరి మార్చుకుని వలసలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది.కానీ ఏది అమైనా బిజేపీ కోసం జగన్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నా, కార్యకర్తలు కాస్త అసహనంతో వున్నారట.