వైఎస్ జగన్ సంచలన నిర్ణయం.. ఏపీలో కొత్త జిల్లాలు ఇవే..?

చుడబోతే  జగన్ అచ్చం కేసీఆర్ లా చేస్తున్నాడే,ఓ అనిసిస్తుంది.ఎందుకు అంటారా అసలు మీరే చుడండి.ఎందుకు అంటే  కేసిఆర్ కూడా వచ్చిన కోత్తలో అన్ని వ్యసస్థలపై ఒక అవగాహన తెచ్చుకోని అ తర్వాత నియంతాలా పాలించడం  స్టార్ట్ చేశాడు. కేసీఆర్ రాష్ట్రాన్ని తనకు నచ్చినట్టు మార్చాడు.లేకపోతే ఎక్కడి 10 జిల్లాలు ఎక్కడ 33 జిల్లాలు ఇలా చేసీ తనకు ఇష్టం వచ్చినట్టు చేశాడు. ఇప్పుడు జగన్ కూడా అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు.

రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన చేసి వచ్చే జనవరి 26 నుంచి కొత్త జిల్లాలను అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో బుధవారం మాట్లాడినట్లు తెలిసింది. రాష్ట్రంలో ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయాలని భావిస్తున్నట్లు వివరించినట్లు సమాచారం. జిల్లాల పునర్విభజన పాలనలో కొత్త ఒరవడికి, వికేంద్రీకృత సేవలకు ఉపకరిస్తుందని పేర్కొన్నారని.. కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా ప్రజలకు అందించే సేవలను మరింత దగ్గర చేసేందుకు ఆస్కారం ఉంటుందని చెప్పారని అంటున్నారు. దీనిపై గవర్నర్‌ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.

4 నెలల్లోపు కొత్త జిల్లాల ఏర్పాటు కసరత్తును పూర్తిచేసి.. జనవరి 26న గణతంత్ర దినోత్సవం నాడు అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

"
"