అలా అయితేనే జగన్ ని గౌరవిస్తా…పవన్ సంచలన వ్యాఖ్యలు…

అంద్రప్రదేశ్ లో వైఎస్ జగన్, పవన్ కల్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ సీఎం జగన్‌ను జగన్ రెడ్డి అని సంబోధించడంపై వైసీపీ వర్గాలు తీవ్రస్థాయిలో స్పందించాయి. పవన్ కళ్యాణ్ సీఎం జగన్‌ను జగన్ రెడ్డి అంటే… అందుకు కౌంటర్‌గా పవన్ కళ్యాణ్‌ను పవన్ నాయుడు అంటూ ఎదురుదాడి చేశారు.

పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నా… ఒప్పుకోకపోయినా సీఎం జగన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని… ఆయనను గౌరవించాలని పవన్‌కు వైసీపీ నేతలు సూచించారు. అయితే దీనిపై కడప జిల్లా రైల్వే కోడూరులో పవన్ కళ్యాణ్ స్పందించారు.ప్రజారంజక పాలన అందిస్తేనే జగన్ ను గౌరవనీయులైన ముఖ్యమంత్రి అని అంటానని పవన్ కళ్యాణ్ అన్నారు. అలా కాకుండా కేవలం పార్టీ నేతల కోసం, తన మద్దతుదారుల కోసమే పరిపాలన చేస్తున్నంత కాలం ముఖ్యమంత్రిని జగన్ రెడ్డి అని మాత్రమే అంటానని వ్యాఖ్యానించారు. మరి… పవన్ కళ్యాణ్ తాజా వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఏ రకంగా స్పందిస్తారో చూడాలి.