వైఎస్ జగన్ కు షాక్…అసలు విషయం ఇదే..?

వైఎస్ జగన్, ఏపీలో ఆయన ప్రస్తూతం తనకిష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి క్యాట్ షాక్ ఇచ్చింది. జగన్ సర్కార్ సస్పెండ్ చేసిన ఐఆర్‌ఎస్‌ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్‌ను క్యాట్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణకిషోర్‌ తిరిగి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు అనుమతినిస్తూ ట్రిబ్యునల్‌ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చని ఈ సందర్భంగా క్యాట్‌ పేర్కొంది.

 

గత ప్రభుత్వంలో ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా పనిచేసిన కృష్ణ కిషోర్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో జగన్ ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కృష్ణకిషోర్ సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది.ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిశోర్‌ని ఏపీ ప్రభుత్వం ఇటీవల సస్పెండ్ చేసింది. టీడీపీ ప్రభుత్వంలో ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా కృష్ణ కిశోర్‌పై మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీ సీఐడీ ఆయనపై కేసు నమోదు చేసింది. ఈడీబీ సీఈవోగా ఉన్న సమయంలో ప్రభుత్వ అనుమతి లేకుండా రూ.కోట్ల విలువైన ప్రకటనలు జారీ చేశారన్న అభియోగాలపై ఆయనపై కేసులు పెట్టారు.

"
"