జ‌గ‌న్ స‌ర్కార్ భూముల అమ్మకంపై కేంద్రం సీరియస్…? అందుకే వెనక్కు త‌గ్గారా…!

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమ‌లు చేస్తుంది. అంత వరకు బాగానే ఉంది… ప్రజల్లో కూడా జగన్ లో చెయ్యాలి అనే తపన కనపడుతుంది అని కూడా ప్రచారం జరుగుతోంది. కాని రాష్ట్రానికి ఆదాయం మాత్రం లేదు. అప్పు చేసి పప్పు కూడు అన్న చందంగా రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ఆరు నెల‌ల్లో ఏపీ ప్ర‌భుత్వం చేసిన అప్పుల లెక్క‌లు చూస్తుంటే కేంద్రం సైతం విస్మ‌యం వ్య‌క్తం చేస్తోన్న ప‌రిస్థితి.ఇక ఆదాయం లేక‌పోవ‌డంతో జ‌గ‌న్ స‌ర్కార్ ప్రభుత్వ భూములు అమ్మాలని భావించడం, పోలవరం కాల్వలపై మట్టి అమ్మాలని భావించడం వంటివి జనాలను అమిత ఆశ్చర్యానికి గురి చేసాయి అనేది వాస్తవం.

రాజకీయంగా కూడా ఈ నిర్ణయాలు దుమారం రేపుతున్నాయి. అసలు భూములు అమ్మితే రాష్ట్ర ప్రజలకు ఆస్తులు ఉండవని… ప్రభుత్వం వద్ద ఆస్తులు లేకపోతే నిధులు అవసరమైనప్పుడు ఏ విధంగా అప్పులు తెస్తారు అనే ప్రశ్న వినపడుతుంది.సంక్షేమ కార్యక్రమాలను అమలు చెయ్యాలి అంటే… ఆదాయ వనరులు ఉండాలి… ఆదాయ వనరుల విషయంలో జాగ్రత్తలు తీసుకుని… ఆదాయం భారీగా వస్తేనే సంక్షేమ కార్యక్రమాలను అమలు చెయ్యాలి, అప్పులు చేయడం ఆస్తులు అమ్మడం వంటివి జనాలను ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పుడు దీనిపైనే కేంద్రం ఆగ్రహంగా ఉందనే ప్రచారం జరుగుతుంది.దేవాలయాల భూములు అమ్మడం ఏంటి ? ఏ విధంగా ఆస్తులు అమ్ముతారు ?రేపు నిధులు లేకపోతే కేంద్ర౦ వద్దకు వస్తారా ? అసలు ఆదాయం లేకుండా సంక్షేమ కార్యక్రమాలను ఏ విధంగా అమలు చేస్తారు ?

ఆదాయం మీద పెట్టుబడికి అమ్మకుండా సంక్షేమ కార్యక్రమాల పేరుతో జనాలకు డబ్బులు పంచడానికి ఆస్తులు అమ్మడం ఏంటి…? అధికారం ఉందని ఏకపక్షంగా ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారు…? అంటూ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ౦పై సీరియస్ గా ఉందని అంటున్నారు.

"
"