నమ్ముకున్నందుకు ఆ ఇద్దరిని పక్కన పెడుతున్న జగన్.. అసలు కారణం ఇదేనా..?

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్  సంచలన నిర్ణయాలు తీసుకుంటు ముందుకు వేళ్తున్న విషయం తెలిసిందే. తనకు వున్నవారిని మరీ చేప్పాలంటే టీడీపీ ప్రభుత్వం పై వ్యతిరేకత తీసుకుని రావడానికి వైసీపీ కి సహకరించిన వారందరికి వైఎస్ జగన్ ఏదో ఒక పదని ఇస్తునే వున్నాడు కాని ఒక్కరి విషయంలో ఇంకా మంచు మోహన్ బాబు విషయంలో మోండి చేయ్యి చూపిస్తునే వున్నాడు.ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారికి పలు పదవులు కట్టబెడుతోంది. 30 ఇయర్స్ పృధ్వీకి ఎస్వీబీసీ చైర్మన్ పదవి కట్టబెట్టింది. తాజాగా విజయ్ చందర్‌కు ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించింది. అంతకు ముందే వైసీపీ ఎమ్మెల్యే అయిన రోజాకు ఏపీఐఐసీ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించింది. రోజా మంత్రిపదవి ఆశించినా.. ఆమెకు నిరాశే ఎదురైంది.

సీఎం జగన్ నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తున్నారనే ప్రతిసారీ.. తెలుగు సినిమాకు సంబంధించి పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. అందులో మంచు మోహన్ బాబుతో పాటు ఆలీ కూడా ఉన్నారు. వారిద్దరూ తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న నటులు. మోహన్ బాబు.. సీఎం జగన్‌కు బంధువు కూడా అవుతారు. జీవితా రాజశేఖర్, పోసాని కృష్ణమురళి వంటి వారు కూడా ఉన్నా.. పదవుల విషయంలో మోహన్ బాబు, అలీ పేర్లే ఎక్కువగా వినిపించాయి. అయితే, వారిద్దరికీ ఇప్పటి వరకు పదవులు రాకపోవడం వెనుక ఓ బలమైన కారణం ఉందని వైసీపీలో చర్చ జరుగుతోంది.సినిమా ఇండస్ట్రీ నుంచి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పదవులుపొందిన వారిని పరిశీలిస్తే.. వారంతా జగన్‌కు మొదటి నుంచి అండగా ఉన్నారు. వైసీపీ ప్రారంభం నుంచి వారు ఆయన వెంట నడిచారు. 30 ఇయర్స్ పృథ్వీ వైసీపీ ఆరంభం నుంచే జగన్ వెంట ఉన్నారు. అలాగే, విజయ్ చందర్ కూడా. బయట పెద్దగా ప్రెస్ మీట్లలో కనిపించకపోయినా.. తెరవెనుక వారు ఎప్పుడూ జగన్‌ను కలుస్తూ.. వారి అభిమానాన్ని చాటుకుంటూనే వచ్చారు.

మిగిలిన వారి విషయంలో అది పూర్తి భిన్నంగా ఉంది. వారంతా ఎన్నికలకు కొన్ని నెలలు లేదా కొన్ని రోజుల ముందు మాత్రమే వైసీపీకి దగ్గరయ్యారు. కొందరు టీడీపీలోకి వెళ్దామా? వైసీపీలోకి వెళ్దామా? అని డైలమాలో ఉండి… చివరకు జగన్‌కు జై కొట్టారు. ఇవన్నీ పరిశీలించిన మీదట.. జగన్ తనను మొదటి నుంచి నమ్మిన వారికే అవకాశాలు, పదవులు ఇవ్వాలని బలంగా నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. అందువల్లే కొందరు సినీ ప్రముఖులకు జగన్ ప్రభుత్వంలో ఎలాంటి పదువులు దక్కడం లేదని చర్చ జరుగుతోంది.