ఏపీ కేబినేట్ లో ఆయనదే 2 వ స్థానం.. జగన్ అంతలా నమ్మడం వెనుక రీజన్ ఇదే..?

అంతా బానే వుంది జగన్ సీయం అయ్యాడు. పాలన సాగుతుంది కాని ఇప్పుడు ఒక కోత్త చర్చ తేరపైకి వచ్చింది. అది ఏమిటంటే జగన్ తర్వాత ఏవరు అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.ఏపీ కేబినెట్‌లో ప్రస్తుతం ఐదుగురు ముఖ్యమంత్రులు ఉన్నారు. అయితే పలు కీలకమైన అంశాల్లో మాత్రం వారెవరూ అంతగా స్పందించడం లేదు. ఏపీలోని అధికార వైసీపీకి సుప్రీం సీఎం జగన్ అనే విషయంలో ఎవరికీ అనుమానాలు.అయితే వైసీపీలో జగన్ తరువాత నంబర్ 2 ఎవరనే ప్రశ్న తలెత్తితే మాత్రం… చాలామంది నుంచి వినిపించే పేరు విజయసాయిరెడ్డి. వైసీపీ తరపున విజయసాయిరెడ్డి మాట్లాడిందే అఫీషియల్ అని ఆ పార్టీ శ్రేణులు కూడా భావిస్తుంటాయి.

వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత అయిన విజయసాయిరెడ్డి… రాష్ట్ర వ్యవహారాలపై కూడా ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ… టీడీపీపై రాజకీయ దాడిని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఏపీ కేబినెట్‌లో జగన్ తరువాత స్థానం ఎవరిదనే అంశంపై మాత్రం రాజకీయవర్గాల్లో సరికొత్త టాక్ వినిపిస్తోంది.ఏపీ కేబినెట్‌లో ప్రస్తుతం ఐదుగురు ముఖ్యమంత్రులు ఉన్నారు. అయితే పలు కీలకమైన అంశాల్లో మాత్రం వారెవరూ స్పందించడం లేదు. రాజధాని అమరావతి అంశంతో పాటు వివిధ కీలకమైన అంశాలపై సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వ తరపున వివరణ ఇస్తున్నారు. అమరావతిపై ప్రభుత్వ వైఖరి ఏంటనే విషయంపై స్పష్టత ఇవ్వకపోయినా… రాజధానిపై అన్ని అంశాల్లోనే ప్రభుత్వ తరపున వాదనను వినిపిస్తూ వచ్చారు బొత్స సత్యనారాయణ.తాజాగా టీడీపీ తలపెట్టిన చలో ఆత్మకూరు వంటి రాజకీయ అంశాల్లోనూ టీడీపీకి కౌంటర్ ఇచ్చే బాధ్యతను మంత్రి బొత్స తీసుకోవడం విశేషం. అయితే వైసీపీ ప్రభుత్వంలో బొత్స అఫీషియల్‌గా నెంబర్ 2 కాకపోయినప్పటికీ… కీలకమైన అంశాలపై ప్రభుత్వం తరపున ఆయన స్పందించడాన్ని బట్టి చూస్తుంటే… ఏపీ సర్కార్‌లో జగన్ తరువాత నెంబర్ 2 స్థానం ఆయనదే అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.కాని రాను రాను బోత్సా సత్యనారాయణ ఇలాగే ప్రకటనలు చేస్తే భవిష్యత్త్ లో తప్పని సరీగా అధిపత్య పోరు నడుస్తుందని వైసీపీ వర్గాల టాక్.

"
"