జగన్ కీలక నిర్ణయం.. ప్రైవెట్ డాక్టర్స్ కు చెక్

వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకునాడు ఇప్పటి నుండి ప్రైవేట్ ప్రాక్టీస్ లు ఇక లేవని తేల్చేసాడుప్రభుత్వాసుపత్రుల్లో విధులు నిర్వర్తిస్తున్న వైద్యుల ప్రైవేటు ప్రాక్టీ్‌సను నిషేధించాలని సంస్కరణల కమిటీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి సూచించింది. అప్పుడే ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలు మెరుగవుతాయని స్పష్టం చేసింది. దీనిపై స్పందించిన సీఎం ప్రైవేటు ప్రాక్టీ్‌సపై నిషేధంతోపాటు ప్రభుత్వ వైద్యుల జీతాలు పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్య శాఖలో సంస్కరణల కోసం ప్రభుత్వం నియమించిన సుజాతారావు కమిటీ సుమారు 100 సూచనలతో బుధవారం సీఎంకు నివేదిక అందించింది. నివేదికలోని అంశాలపై కమిటీ చైర్‌పర్సన్‌ సుజాతారావు సుమారు రెండు గంటలు సీఎంకు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

అధికారులతో సుదీర్ఘంగా చర్చించిన సీఎం విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని, ఇంజనీరింగ్‌ అయినా, మెడిసిన్‌ అయినా అనుభవం కచ్చితంగా ఉండాలని సూచించారు. ఏ వృత్తి విద్యా కోర్సు తీసుకున్నా, చివరి ఏడాది వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఉండాలని చెప్పారు. అప్రంటీస్‌ అనేది పాఠ్యప్రణాళికలో ఒక భాగం కావాలని సూచించారు. మన విద్యా వ్యవస్థలో ఈ లోపం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. దీనిపై సరైన సూచనలు చేయాలని కమిటీకి సూచించారు. ప్రభుత్వాసుపత్రుల దశ, దిశ మారుస్తామన్నారు. సిబ్బంది కొరత లేకుండా, సదుపాయాలు కల్పించగలిగితేనే వ్యవస్థ బతుకుతుందన్నారు. రోగులు ఆసుపత్రికి రాగానే వారికి నమ్మకం కలిగించేలా ఉండాలన్నారు. ఆసుపత్రిలో పడకలు, దిండ్లు, బెడ్‌షీట్లు, బాత్‌రూమ్స్‌, ఫ్లోరింగ్‌, గోడలు వీటన్నింటినీ కూడా మార్చాలని సూచించారు. ఫ్యాన్లు, లైట్లు అన్నీ సరిగ్గా పని చేయాలన్నారు. అవసరమైన చోట ఏసీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ మార్పులు చేయగలిగితేనే ప్రభుత్వ ఆసుపత్రుల మీద ప్రజల దృక్పథం మారుతుందన్నారు.మెడికల్‌ కాలేజీల తరహాలో నర్సింగ్‌ కాలేజీలపైనా పర్యవేక్షణ ఉండాలన్నారు. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో తప్పనిసరిగా నర్సింగ్‌ కాలేజీలనూ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆశావర్కర్ల శిక్షణకు పాఠ్యప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. 108, 104 వాహనాల నిర్వహణకు సమర్థ యంత్రాంగాన్ని ఏర్పాటు చే యాలని సూచించారు. నాడు-నేడు కింద ప్రభుత్వాసుపత్రుల్లో చేపట్టనున్న కార్యక్రమాలపై సీఎం సమీక్ష చేశారు. గత ప్రభుత్వంలో కుదుర్చుకున్న ఒప్పందాల్లో లోపాలను బయటపెట్టిన కమిటీ, వీటిపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలన్న మందులనే కొనుగోలు చేయాలన్నారు. హైదరాబాద్‌, బెంగళూర్‌, చెన్నైలోని 150 ఆసుపత్రుల్లో సూపర్‌ స్పెషాలిటీ సేవలకు ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామన్నారు. దీన్ని నవంబరు 1న ప్రారంభిస్తామని, డిసెంబరు 21 నుంచి ఆరోగ్యకార్డులు జారీ చేస్తామన్నారు. ఆరోగ్యశ్రీ జాబితాలోకి అదనంగా వ్యాధులను తీసుకొస్తున్నామన్నారు. జనవరి 1 నుంచి కొత్త ప్రతిపాదనలతో ఆరోగ్యశ్రీ పైలెట్‌ ప్రాజెక్టు అమలు చేస్తామన్నారు.

పశ్చిమగోదావరిలో 2 వేల వ్యాధులను, మిగిలిన జిల్లాల్లో 1200 వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువస్తున్నామన్నారు. 2020 ఏప్రిల్‌ 1 నుంచి వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే విధానాన్ని అమలు చేస్తామన్నారు. ఆరోగ్యశ్రీకి బిల్లులు చెల్లించకుండా గత ప్రభుత్వం తాత్సారం చేసిందని, దాదాపు రూ.1000 కోట్ల బిల్లులను పెండింగ్‌లో పెట్టిందని అధికారులు సీఎంకు వివరించారు. నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో ప్రమాణాలపై తనిఖీ అంశాలను కూడా సీఎం సమీక్షించారు.

"
"