మోడీకి మూడు రోజుల గడువు..! చంద్రబాబు లాస్ట్ చాన్స్..!

ఏపీ భవన్‌లో ఢిల్లీ మొత్తం కదిలిపోయేలా.. చంద్రబాబు దీక్ష జరుగుతోంది. దేశంలో ఉన్న ప్రముఖ నేతలంతా వచ్చి చంద్రబాబుకు సంఘిబావం తెలియజేస్తున్నారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది.. క్షమాపణ చెప్పడానికి .. చంద్రబాబు.. మూడు రోజుల గడువు ఇచ్చారు. కేంద్రానికి గుణపాఠం చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని చంద్రబాబు తేల్చి చెప్పారు . కొన్ని పార్టీలను పట్టుకుంటే గెలవొచ్చని మోదీ అనుకుంటున్నారని.. తెలుగువారి సత్తా.. ప్రజల నాడి తెలియని వ్యక్తి అని మండిపడ్డారు. ఇప్పటికైనా మూడు రోజుల టైముంది.. ఇది తప్పని పార్లమెంటులో అంగీకరిస్తే తెలుగు ప్రజలు క్షమిస్తారు.. చేయకపోతే ఏపీ ప్రజానీకం శాశ్వతంగా బీజేపీని బహిష్కరిస్తారని చంద్రబాబు ఆఫర్ ఇచ్చారు.

ఏపీ చరిత్రలో బీజేపీ పూర్తిగా తుడుచుకుపెట్టుకుపోయే పరిస్థితి వస్తుంది. ఏపీలో బీజేపీకి పూర్తిగా తలుపులు మూసుకుపోతాయి. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేవరకు ఈ పోరాటం ఆగదు. ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఐటీ, ఈడీ దాడులు చేస్తున్నారు. మేము కన్నెర్ర చేస్తే మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. మోదీ ధర్మాన్ని పాటించే వ్యక్తయితే విభజన గాయాన్ని ఇంకా పెద్దగా చేసి కారం చల్లి సంతోషిస్తున్నారని.. ఇది నీచం..పరమ దుర్మార్గమని చంద్రబాబు మండిపడ్డారు. దీక్ష సందర్భంగా ఢిల్లీలోని ఏపీ భవన్‌లో కోలాహలం నెలకొంది. దీక్షకు ఏపీ నుంచి పెద్ద ఎత్తున మంత్రులు , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తరలివచ్చారు. ఏపీ భవన్‌ రోడ్డులో జాతీయ, అంతర్జాతీయ ఓబీ వాహనాలు బారులు తీరాయి. ఏపీ భవన్‌ మొత్తం జనంతో కిటకిటలాడుతున్నాయి.

దీక్షకు మద్దతుగా పలు జాతీయ పార్టీల కార్యకర్తలు తరలివచ్చారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. ఏపీకి మద్దతుగా.. అందరూ… వచ్చి మద్దతు పలికి వెళ్తున్నారు. మోడీ తీరుపై.. తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు. అందరూ కలిసి… పోరుబాట పట్టబోతున్నారు. మోడీకి అంతిమ గడియలు… ఏపీభవన్ నుంచే ప్రారంభణవుతున్నట్లు స్పష్టమవుతోంది. మూడు రోజుల తర్వాత.. వ్యూహాత్మక కార్యాచరణ ప్రారంభించే అవకాశాలను… విపక్ష పార్టీలు… పరిశీలిస్తున్నాయి.