లెక్కలపై చంద్రబాబు గర్జనకు సమాధానం ఉందా మోడీ..?

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులకు..మోడీ లెక్కలు అడుగుతున్నారు. ఇచ్చిన ప్రతి పైసాకు లెక్క చెప్పిస్తామంటూ.. మోడీ.. చెప్పుకొచ్చారు. ఓ రకంగా ఆయన ఏపీని బెదిరించి వెళ్లారు. ఆ సొమ్ములన్నీ కేంద్రానికి ఎక్కడి నుంచి వస్తాయి..? ఏపీ నుంచి వెళ్లే ఆదాయపు పన్ను మొత్తం కేంద్రానికే పోతుంది. ఏపీలో కేంద్ర పన్నులు మొత్తం కేంద్రానికి వెళ్తాయి. ఏపీలో ఎవరు ఏ వస్తువు కొన్నా సీజీఎస్టీ మొత్తం కేంద్రానికి వెళ్తాయి. అవే తిరిగి ఇస్తారు. అంటే.. రాష్ట్రాల నుంచే.. కేంద్రానికి నిధులు వెళ్తాయి. కేంద్రం అనేదానికి ప్రత్యేకంగా అస్థిత్వం లేదు. రాష్ట్రాలన్నీ కలిస్తే.. కేంద్రం. కేంద్రానికి ప్రత్యేకంగా ఏమీ లేదు. అందుకే కేంద్రం మిధ్య అన్నారు. రాష్ట్రాలులేకుండా కేంద్రం ఉండదు.

అందుకే… మేమిచ్చే నిధులకు… లెక్కలు చెప్పాలనడం కరెక్ట్ కాదు. మోడీ చక్రవర్తి కాదు.. చంద్రబాబు సామంత రాజు కాదు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నారు. రాష్ట్రం చేసే ఖర్చుల వివరాలు అసెంబ్లీకి చెబుతారు. కేంద్రం చేసే ఖర్చుల వివరాలు పార్లమెంట్ కు చెబుతారు. ఇలా లెక్కలు చెప్పాలని అడగడం… ఏపీని అవమానించడమే. రాష్ట్రాల వ్యవస్థలు రాష్ట్రాలకు ఉన్నాయి. వాటికి సీఎం బాధ్యునిగా ఉంటారు. లెక్కలు అడగడానికి మోడీ ఎవరు..? ప్రధానికి ఆ హక్కు ఎక్కడిది..? దేశం ఏమీ ఆయన జారీ కాదు కదా..! అనే మాటలు.. నిపుణుల వద్ద నుంచి వస్తున్నాయి.

ధర్మపోరాట దీక్షలో చంద్రబాబు కూడా అదే చెబుతున్నారు. ్యితే.. చంద్రబాబు ప్రజాస్వామ్య పద్దతిలో కౌంటర్ ఇచ్చారు. తము లెక్కలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని.. అదే సమయంలో… ఏపీ నుంచి   వసూలు చేసిన పన్నుల వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై.. బీజేపీ నేతలు కిక్కురుమనలేకపోతున్నారు. అందుకే ఏం సమాధానం చెప్పాలో తెలియక.. నానా తిప్పలు పడుతున్నారు. ఈ విషయంలో.. ఏపీ ప్రజల పౌరుషం అంటే ఏమిటో.. తెలియచెప్పేలా… ఏపీ ప్రజలు.. కొత్త కొత్త పోరాటలు చేయబోతున్నారు. మోడీ లెక్క తేల్చేదాకా..వదిలే ప్రసక్తే లేదంటున్నారు.