వైసీపీ అయినా చంద్రన్న ఆదుకుంటారు..! కళ్లు చెమర్చే ఘటన ఇది..!

నాలుగు రోజుల క్రితం పిడుగురాళ్లలో ఓ యువకుడు మృతి చెందాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని అయిన.. ఆయన.. యాత్ర సినిమా కోసం పార్టీ ర్యాలీ కోసం వెళ్లి గుండెపోటుతో చనిపోయాడు. ాయన పేరు శ్రీనివాసరెడ్డి. చిరువ్యాపారం చేస్తున్నాడు. వైఎస్‌ నేపథ్యంలో చిత్రీకరించిన ‘యాత్ర’ సినిమా చూసేందుకు ఈ నెల 8న వెళ్లి వైసీపీ ర్యాలీలో పాల్గొన్నాడు. అంతలోనే హఠాత్తుగా గుండెపోటుతో శ్రీనివాసరెడ్డి మృతి చెందాడు. చేతికందివచ్చిన కొడుకు మృతి చెందటంతో తల్లిదండ్రులు మనోవేదనకు గురయ్యారు. ఓ వైపు ఆర్థిక బాధలు..మరో వైపు.. కొడుకు మృతి చెందిన వైనం.. ఆ తల్లిదండ్రుల్ని వేదనకు గురి చేసింది. కానీ…వారిని దేవుడిలా.. ఆదుకున్నాడు చంద్రన్న.

ఇంటి ముందు.. భౌతిక కాయం ఉండగానే… వెంకటేశ్వరరెడ్డి దంపతుల వద్దకు బీమా మిత్ర వచ్చారు. మీ కుమారుడికి చంద్రన్న బీమా మంజూరైందని తెలిపారు. ప్రభుత్వం నుంచి రూ. ఐదు లక్షల సాయం సాయం అందుతుందని బీమా మిత్ర చెప్పడంతో ఆశ్చర్యపోయారు. అంత్యక్రియల కోసం.. అక్కడిక్కడే.. రూ. రూ.5 వేలు ఇచ్చారు. మిగతా మొత్తం బ్యాంక్ అకౌంట్‌లోవేశారు. తాము ప్రీమియం కట్ట లేదని.. అయినా ఎలా వచ్చిందని..వారు ఆశ్చర్యపోయారు. కానీ.. వారి ఎమ్మెల్యే యరపతినేని… కట్టేశారు. దాదాపుగా నియోజకవర్గంలోని ఎనభై వేల మందికి ఆయనే కట్టేసారు. గతంలోనూ ఇలా కొంత మందిని చంద్రన్న బీమా ఆదుకుంది. గతంలో కఠారి శంకర్‌ అనే వ్యక్తి ఆ రోజు రాత్రి వ్యాపారం ముగించుకొని ఇంటికి వెళ్తూ ప్రమాదంలో మృతిచెందాడు. ఈ ఘటనతో రోడ్డున పడ్డామని కుటుంబ సభ్యులు బాధపడుతుండగా చంద్రన్న బీమా ఉందని తెలియడంతో కొంత తేరుకోగలిగారు. బీమా సొమ్ము రూ.5 లక్షలు రావడంతో పిల్లలను చదివించుకుంటున్నారు.

ప్రభుత్వ పథకాలు పార్టీలకు అతీతంగా నియోజకవర్గ ప్రజలందరికీ అందించాలని చెప్పే గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చేతల్లోనూ చూపారు. చంద్రన్న బీమా ఆపదల్లో కుటుంబానికి ఆదరవుగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. స్వల్ప ప్రీమియం చెల్లిస్తే ఆ కుటుంబంలోని వారు మరణిస్తే ప్రభుత్వం సాయం చెల్లిస్తుంది. ఇలా పార్టీ ఏదైనా… ప్రజలందర్నీ బిడ్డల్లా చూసేది.. చంద్రన్నేనని.. మరోసారి నిరూపితమయింది.