రాజంపేటలో నిండా మునిగిన వైసీపీ.. మెడా దెబ్బకు ఇంత దిగజారిందా..?

గత ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన మేడా మల్లిఖార్జున రెడ్డి ఆ పార్టీలోని ఇతర సామాజికవర్గాల నేతలను, పార్టీలో తన విజయానికి కృషి చేసిన వారిని ఏమాత్రం పట్టించుకోకుండా అన్ని పదవులను తన కుటుంబానికే ఇప్పించుకున్నారు. జిల్లాలో ఏకైక టీడీపీ ఎమ్మెల్యే కావడంతో చంద్రబాబు కూడా అడిగినవన్నీ చేశారు. ప్రస్తుతం వైసీపీలో మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాధ్‌రెడ్డి కుటుంబం ఎన్నికల సమయంలో కీలకపాత్ర పోషిస్తున్నా ఎన్నికల తరువాత వీరి పాత్ర ఏమిటనేది నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.

మేడా మల్లిఖార్జునరెడ్డి ఎణ్మెల్యేతో పాటు విప్ గా ఉన్నారు. కేబినెట్ హోదాలో పెత్తనం చేశారు. మేడా రఘునాధరెడ్డి మేడా మల్లికార్జునరెడ్డికి సోదరుడు. ఈయనే ఆ కుటుంబానికి ఆర్థికంగా పెద్ద దిక్కు. తెలంగాణలో పెద్ద ఎత్తున కాంట్రాక్టులు పొందారు. మేడా రామకృష్ణారెడ్డి ..మేడా మల్లికార్జునరెడ్డి తండ్రి. మేడా కన్‌స్ట్రక్షన్స్‌ అధినేత. ఈయనను తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. మేడా మల్లికార్జునరెడ్డికి మేడా విజయభాస్కర్‌రెడ్డి స్వయానా చిన్నాన్న. నందలూరు మండలంలో మేడా విజయభాస్కర్‌రెడ్డి అంటే అందరికీ హడల్‌. ఈయన నందలూరు సింగిల్‌విండో అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన భార్య మేడా పద్మజ మండలాధ్యక్షురాలు. మేడా పద్మజ నందలూరు మండలాధ్యక్షురాలు. మేడా మల్లికార్జునరెడ్డికి పిన్నమ్మ. సింగిల్‌విండో అధ్యక్షుడు మేడా విజయభాస్కర్‌రెడ్డి భార్య. మేడా మల్లికార్జునరెడ్డి పిన్నమ్మ కావడంతో ఆమెకు ఈ పదవిని ఇచ్చారు.నరసింహారెడ్డి మేడా మల్లికార్జునరెడ్డికి మేనమామ. నందలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర చైర్మన్‌ పదవి లభించింది. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా ఈయన ఈ పదవిలో కొనసాగుతున్నారు

మేడా మధుసూదన్‌రెడ్డి మేడా మల్లికార్జునరెడ్డికి స్వయానా తమ్ముడు. మేడా విజయభాస్కర్‌రెడ్డి మేడా మల్లికార్జునరెడ్డికి చిన్నాన్న కుమారుడు. విజయశేఖర్‌రెడ్డి గత ఐదేళ్ల నుంచి సుండుపల్లె, వీరబల్లి మండలాల ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. మేడా రాజశేఖర్‌రెడ్డి మల్లికార్జునరెడ్డికి చిన్నాన్న కుమారుడు. విజయభాస్కర్‌రెడ్డి సొంత సోదరుడు. ఈయన ప్రస్తుతం వీరబల్లి బాధ్యతలను చూసుకుంటున్నారు. ఇలా రాజంపేటలో పదవులన్నీ కుటుంబంలోని వారే పొందడంతో.. ప్రజల్లో తీవ్ర వ్యతిరే్కత ఉంది. వీరిని ఇంటికి పంపాలే ఆలోచన చేస్తున్నారు.