గుర‌జాలలో ‘ య‌ర‌ప‌తినేని ‘ కి మ‌హిళ‌ల‌ నీరాజ‌నం… పసుపు కుంకుమ‌తో ఆద‌ర్శం

రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జ‌రుగుతున్న ప‌సుపు-కుంకుమ కార్య‌క్ర‌మం ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ పేరు తెచ్చుకుంటోంది. ఎక్క‌డిక‌క్క‌డ నాయ‌కులు పెద్ద ఎత్తున ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా జ‌రుగుతున్న ప‌సుపు-కుంకుమ కార్య‌క్ర‌మం ఒక ఎత్త‌యితే.. ఒక్క గుర‌జాల నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతున్న కార్య‌క్ర‌మం మాత్రం న‌భూతో అన్న‌విధంగా సాగుతోంది. ప్ర‌తి మ‌హిళ‌కు ఇక్క‌డ ద‌క్కుతున్న గౌర‌వం అంతా ఇంత అని చెప్ప‌లేని విధంగా ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు దూసుకుపోతున్నారు. సాధార‌ణంగా ఈ కార్య‌క్ర‌మం కింద ప్ర‌భుత్వ‌మే పింఛ‌న్ల‌ను, చెక్కులును జారీ చేస్తోంది. అయితే, ఇక్క‌డ మాత్రం ఎమ్మెల్యే శ్రీనివాస‌రావు మాత్రం మ‌రింత‌గా దూసుకుపోతున్నారు.

నియోజ‌క‌వ‌ర్గంలో గ్రామ గ్రామానా ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తూ.. మ‌హిళ‌ల‌ను కార్య‌క్ర‌మానికి ప్ర‌త్యేకంగా ఆహ్వానిస్తున్నారు. ప్ర‌తి ఒక్క‌రినీ పేరు పేరునా ప‌ల‌క‌రిస్తూ.. వారికి ప్ర‌భుత్వం నుంచి అందుతున్న ప‌సుపు-కుంకుమ చెక్కుల‌తోపాటు సొంత నిధుల‌తో ప్ర‌తి మ‌హిళ‌కు చీర, స్వీటు బాక్సును అందిస్తూ.. త‌న ఆప్యాత‌ను పంచుతున్నారు. నిజానికి య‌ర‌ప‌తి నేని ఈ విష‌యంలో రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేల క‌న్నాకూడా చాలాముందున్నార‌ని చెప్ప‌డంలో సందేహం లేదు. ఏకంగా 60 వేల మంది మ‌హిళ‌ల‌కు పెద్ద‌న్న‌గా, త‌మ్ముడిగా మేలు చేసిన ఏకైక ఎమ్మెల్యేగా య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు క‌నిపిస్తారు. శీన‌న్న గా ప్ర‌సిద్ధి చెందిన ఈ ఎమ్మెల్యే వ‌రు స విజ‌యాల‌తో ఇక్క‌డ దూసుకుపోతూ.. మ‌రోసారి వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కి హ్యాట్రిక్ అందుకునే ల‌క్ష్యంతో ప‌రుగులు పెడుతున్నారు.సంక్రాంతిని పుర‌స్క‌రించుకుని పండ‌గ‌కు వారం ముందు నుంచి నియోజ‌వ‌క‌ర్గం ప‌రిధిలోని పిడుగురాళ్ల‌, పిడుగురాళ్ల రూర‌ల్‌, దాచేప‌ల్లి, గుర‌జాల మండ‌లాల‌కు చెందిన మ‌హిళ‌ల‌కు ప్ర‌త్యేకంగా విందు ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా వారికి పుట్టింటి నుంచి సారె అందించిన విధంగా ఖ‌రీదైన చీర‌, పసుపు, కుంకుమ‌తోపాటు స్పీటు బాక్సును ఓ ప్యాక్‌లో పెట్టి స‌గౌర‌వంగా ప్ర‌తి ఒక్క‌రికీ అందించారు. మొత్తంగా 60 వేల మంది అక్క‌లు, చెల్లెళ్ల‌కు శీన‌న్న ఇచ్చిన విందు, సారెల‌తో నియోజ‌క‌వ‌ర్గం మార్మోగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్య‌క్ర‌మం పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు రావ‌డంతో పాటు చంద్ర‌బాబు సైతం ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌త్యేకంగా ప్ర‌శంసించారు. అలాగే ఈ కార్య‌క్ర‌మం పెద్ద సంచ‌ల‌నం క్రియేట్ చేయ‌డంతో పాటు య‌ర‌ప‌తినేనికి తెలుగు ప్ర‌జ‌ల్లో మంచి గుర్తింపు రావ‌డంతో ఈ కార్య‌క్ర‌మంపై మిగిలిన జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం య‌ర‌ప‌తినేనిని స్వ‌యంగా క‌లిసి ఆరా తీస్తున్నారు. ఈ రేంజ్‌లో తాము సైతం మ‌హిళ‌ల‌కు చేయ‌లేమ‌ని వారు త‌మ అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో చ‌ర్చించుకుంటున్నారు.

ఈ మ‌హిళ‌లు అంద‌రూ అన్న పెట్టిన సారెను ఇంటికి తీసుకువెళ్లి ఒకే ర‌క‌మైన చీర‌లు ధ‌రించి నియోజ‌క‌వ‌ర్గంలో సంక్రాంతిని జ‌రుపుకోవ‌డం సంచ‌ల‌న రికార్డుగానే పేర్కొన వ‌చ్చు. గుర‌జాల నియోజ‌క‌వ‌ర్గంలో ఆడ‌ప‌డుచులు అంద‌రూ శీన‌న్న త‌మ ప‌ట్ల చూపిస్తోన్న ప్ర‌త్యేక ఆద‌ర‌ణ‌తో పాటు ఇక్క‌డ ప‌సుపు – కుంకుమ జ‌రిగిన తీరుకు, గ‌త కొన్నేళ్లుగా క్ర‌మం త‌ప్ప‌కుండా త‌మ‌పై చూపిస్తోన్న ప్రేమాభిమానాల‌కు ఫిదా అవుతున్నారు. ఫెన్ష‌న్ తీసుకునేవాళ్లంద‌రికి పార్టీలు, కులాలు, మ‌తాలు అన్న‌దాంతో సంబంధం లేకుండా జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌జ‌లు పోటెత్తారు. య‌ర‌ప‌తినేని కేవ‌లం ఈ ఒక్క‌సారే కాదు. ఏటా ఆయ‌న ఇక్క‌డి ఆడ‌ప‌డుచుల‌కు సీమంతం నిర్వ‌హిస్తారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేరు తెచ్చి పెట్టింది. ఓ సాధార‌ణ ఎమ్మెల్యే అయి ఉండి కూడా నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధిని ప‌రుగులు పెట్టిస్తూనే.. మ‌రోప‌క్క మ‌హిళా ప‌క్ష‌పాతిగా ఉంటూ.. వారికి ఏ అవ‌స‌రం వ‌చ్చినా.. ఓ అన్న‌గా, త‌మ్ముడిగా నేనున్నానంటూ త‌లుపులు తీసి ఉంచే సంస్కృతికి తెర‌దీశారు. దీంతో ఇక్క‌డ శీన‌న్న పేరు ఎక్క‌డ విన్నా వినిపించేలా మారింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇది ఆయ‌న‌కు మ‌రింత ప్ల‌స్ అవుతుంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. బ‌హుశ 1994లో ఇక్క‌డ నుంచి గెలిచిన య‌ర‌పతినేనికిఅప్ప‌ట్లో ల‌భించిన భారీ మెజారిటీ మ‌రోసారి రిపీట్ అవుతుంద‌ని అంటున్నారు. ఇప్పుడు ఏకంగా య‌ర‌ప‌తినేని త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని సుమారు 40 గ్రామాల‌కు వెళ్లి పేరుపేరునా మ‌హిళ‌ల‌కు ప‌సుపు- కుంకుమ కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేస్తున్నారు.

అదే స‌మ‌యంలో పింఛ‌న్ల‌ను కూడా పేద‌లు, బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల‌కు చెందిన మ‌హిళ‌లకు, వృద్ధుల‌కు అందిస్తున్నారు. అదే స‌మ‌యంలో ఆయా గ్రామాల్లో బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హిస్తూ.. చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని మ‌ళ్లీ ఎన్నుకోవాల్సిన అవ‌స‌రాన్ని ఆయ‌న నొక్కి చెబుతున్నారు. లోటు బ‌డ్జెట్‌లో ఉన్న రాష్ట్ర‌మే అయినా కూడా చంద్ర‌బాబు ఇక్క‌డి ప‌రిస్థితుల‌ను లెక్క చేయ‌కుండా మ‌హిళల కోసం అనేక కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తున్నార‌ని, ఇవి పూర్తిగా అమలు కావాలంటే ఖ‌చ్చితంగా మ‌రోసారి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కావాల్సిన‌, రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని య‌ర‌ప‌తినేని వెల్ల‌డిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే య‌ర‌ప‌తినేని వెంట తామున్నామంటూ.. మ‌హిళ‌లు సైతం అధికార పార్టీకి జైకొడుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.