అంతా వ్యూహంగానే.. చిరు, జగన్ భేటీలో అసలు జరిగింది ఇదే..?

ఎన్నో రోజులుగా కలవాలి అని అనుకుంటున్నచిరంజీవి  ఏట్ట కెలకు ఇవాళ కలిసాడు. అసలు వీళ్ళు కలివక ముందె ఏన్నొ అంశాలపై చర్చలు జరిగాయి. కానీ తాజాగా వీళ్లు కలిసారు అయితె దినిపై ఏం చర్చించుకున్నారు. అసలు వీళ్ల చర్చ ఏక్కడ నుండి మోదలైంది. చివరకి ఏక్కడకి వచ్చి అగింది అని ఇప్పుడు చర్చానియాంశం అయ్యింది.సీఎం జగన్‌తో మెగాస్టార్‌ చిరంజీవి దంపతులు సమావేశమయ్యారు. చిరంజీవి దంపతులను జగన్ దంపతులు సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా జగన్‌ను మెగాస్టార్ శాలువా కప్పి సన్మానించారు. చిరంజీవికి బొబ్బిలి వీణను జగన్ బహుకరించారు. ‘సైరా నరసింహారెడ్డి’ చిత్ర విశేషాలను జగన్‌కు మెగాస్టార్ వివరించారు.సైరా చిత్రం చూడాలని సీఎంను చిరంజీవి కోరారు. జగన్ సీఎం అయిన తర్వాత మొదటిసారిగా చిరంజీవి భేటీ కావడంతో రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది.

ఈనెల 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ‘సైరా’ చిత్రానికి ఎక్కువ షోలు ప్రదర్శించేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా సైరా మూవీ వినోద పన్నుపై జగన్‌తో చిరంజీవి చర్చించినట్లు సమాచారం. రాజకీయ అంశాలపై కూడా వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఏపీలోని కాపు నేతలను వైసీపీకి అనుకూలంగా మలుచుకునే విషయంపైనా వీరి భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాపు సామాజిక వర్గాన్ని వైసీపీకి చేరువగా చేసేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్, చిరంజీవి భేటీపై మరింత ఆసక్తి నెలకొంది.చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. అందుకు ప్రతిఫలంగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ కేంద్ర కేబినెట్‌లో స్థానం కల్పించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోయింది. కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆయన ఏ పార్టీకి అనుకూలంగా పనిచేయలేదు. అయితే చిరంజీవి సోదరుడు పవన్‌కల్యాణ్ మాత్రం జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు.మరీ ఇప్పుడు ప్రజల నుండి ఏలాంటి రియాక్షన్ వస్తుందో అని అందరు అనుకుంటున్నారు.