పవన్ పై ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు.. నాగబాబు ఏం అన్నాడో చూడండి

రోజా చాలా రోజుల నుండి ఏక్కువగా మాట్లాడటం విమర్శలు చేయడం తగ్గించింది. ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరీస్థితులు అమెను చాలా అంటే చాలా సైలెంట్ గా వుండటానికి కారణం ఏమిటని అందరు అనుకుంటున్నారు.ఈ మధ్య కాలంలో రోజా తన నోటికి పని చెప్పలేదు. పైగా పవన్ కల్యాణ్ రివర్స్‌లో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నాడు. కానీ ఈ విషయంపై నాగబాబు దగ్గర చర్చ మాత్రం వచ్చింది. ఆ మధ్య ఒక యూ ట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన నాగబాబు.. తనకు రోజాతో ఉన్న రిలేషన్ గురించి చెప్పాడు. ఇద్దరూ రెండు రాజకీయ పార్టీల్లో ఉన్నారు. ఎవరికి వారు వాళ్ళ పనులు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. దాంతో పాటు సినిమాల్లో కూడా నటిస్తున్నారు. జబర్దస్త్ ప్రోగ్రాంలో ఇద్దరు జడ్జిలుగా ఉన్నారు.

ఈ కార్యక్రమం నుంచి ఇద్దరికీ చాలా గుర్తింపు వచ్చింది కూడా. సినిమాలు లేని సమయంలో జబర్దస్త్ వీళ్ళిద్దరినీ కలిపింది. అక్క‌డి నుంచి వీళ్ళ కెరీర్ మ‌ళ్లీ ఊపందుకుంది. ఇక ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో రోజాపై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు నాగబాబు. రోజా వైసీపీలో ఉంది.. ఆమె అప్పుడప్పుడు పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తూ ఉంటుంది.. అలాంటప్పుడు ఆమె పక్కనే కూర్చుని జబర్దస్త్‌లో ఎలా జడ్జిమెంట్ ఇస్తారు.. అలాంటప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది అని యాంకర్ నాగబాబును ప్ర‌శ్న‌ అడిగాడు.దానికి చాలా కూల్‌గా సమాధానం చెప్పాడు ఈ మెగా బ్రదర్. రోజా, తాను జబర్దస్త్‌లో ఉన్నప్పుడు కేవలం ప్రొఫెషనల్‌గా మాత్రమే ఆలోచిస్తామని.. అక్కడ తమని జడ్జిమెంట్ చెప్పమని పిలిచారని.. అంత వరకే తమ రిలేషన్ ఉంటుందని చెప్పాడు నాగబాబు. అక్కడ ఎవరు ఎలా నవ్విస్తున్నారో అనేది మాత్రమే చూస్తాను కానీ బయట ఎవరిపై ఎవరు ఏం కామెంట్స్ చేస్తున్నార‌నేది పట్టించుకోనంటున్నాడు నాగబాబు. దాంతో రోజాపై కూడా తనకు ఎలాంటి కంప్లైంట్స్ ఉండవని.. ఆ విషయంపై అసలు రియాక్షన్స్ అనేవే ఉండవంటున్నాడు ఈ మెగా బ్రదర్.

వైసీపీ పార్టీ తరఫున మాట్లాడుతుంది పర్సనల్‌గా ఎలాంటివి ఉండవు కాబట్టి ఆమెతో వచ్చే సమస్య ఏమీ లేదు అంటున్నాడు నాగ‌బాబు. పర్సనల్ అటాక్‌కు దిగినప్పుడు తాను కూడా కచ్చితంగా కౌంటర్ ఇస్తానని కానీ జబర్దస్త్‌లో ఉన్నప్పుడు మాత్రం ఇద్దరూ ప్రొఫెషనల్‌గానే ఉంటామ‌ని చెబుతున్నాడు ఈ మెగా సోదరుడు. ప్రస్తుతానికి రోజా అయితే పవన్ కల్యాణ్ ఎన్ని విమర్శలు చేస్తున్నా కూడా సైలెంట్‌గానే ఉంది.