మధ్యలో నీకెందుకు.. సాయిరెడ్డికి అమిత్ షా వార్నింగ్

పరీస్థీతులు ఏప్పుడు మనవైపు వుండవు కదా . ఇప్పుడు అదే మళ్ళి రుజువైంది. అసలు విషయం ఏమిటంటే వైసీపీ రాజ్యసభ సభ్యడు. విజయ్ సాయి రెడ్డి కి బిగ్ షాక్ తగిలింది. బీజేపీ ఢిల్లి పెద్దలు అయనను మందలించారు. మీకు సంబందం  లెని విషయాల గురించి మాట్లాడటానికి మీరేవరూ అన్నట్టు మాట్లాడింది.దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. సమావేశానికి హాజరైన చాలామంది నేతలు విజయసాయిరెడ్డికి క్లాస్ పీకారు. అఖిలపక్ష భేటీలో రాష్ట్రానికి సంబంధించిన, జగన్ జైలు అంశాలను చెప్పేందుకు విజయసాయి రెడ్డి ప్రయత్నించగా పలు పార్టీల నేతలు అడ్డుకున్నారు.

ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన వేదిక కాదంటూ చురకలు అంటించారు. పార్లమెంట్ స్థాయిలో అఖిలపక్షం ఎందుకు పెడతారో నేర్చుకోవాలని విజయసాయికి హితవు చెప్పారు. కాగా, పార్లమెంట్‌ సమావేశాలకు హాజరయ్యేందుకు చిదంబరం బెయిల్ తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఈ భేటీలో కేంద్రాన్ని కాంగ్రెస్ నేతలు కోరారు. వెంటనే కల్పించుకున్న విజయసాయి రెడ్డి.. కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు అవలంభిస్తోందంటూ మండిపడ్డారు. ఈ సమయంలోనే జగన్ జైలు శిక్ష అంశాన్ని విజయసాయి ప్రస్తావించారు. దీనిపై మిగతా పార్టీల నేతలు అసహనం వ్యక్తం చేశారు. ఎక్కడ ఏ అంశాన్ని మాట్లాడాలో తెలియదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.ఇదిలాఉండగా.. చిదంబరం వ్యవహారంలో విజయసాయిరెడ్డి జోక్యంపై హోంమంత్రి అమిత్ షా కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారట. ‘‘కాంగ్రెస్ అడగాల్సింది అడిగింది.. మేము నోటు చేసుకున్నాం. మధ్యలో మీకు వచ్చిన ఇబ్బందేంటి? దీనిపై మీరెందుకు చర్చ పెడుతున్నారు? మీకు సంబంధం లేని విషయంపై మీరెందుకు స్పందిస్తున్నారు?’’ అని విజయసాయిపై అమిత్ షా కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారని విశ్వసనీయ సమాచారం.

కాగా, జగన్ జైలు వ్యవహారాన్ని చిదంబరానికి ఎలా ముడిపెడతారని కాంగ్రెస్ నేతలు సైతం విజయసాయిపై అసంతృప్తి వ్యక్తం చేశారట. అనవసర విషయంపై చర్చకు ఎందుకు వస్తున్నారని టీకే రంగరాజన్, ఎంకే ప్రేమ్‌చంద్రన్, ఇతర సభ్యులు ఆయన్ని ప్రశ్నించారట. అఖిలపక్షానికి ఉండే ప్రాధాన్యత తెలుసుకోవాలని విజయసాయిరెడ్డికి నేతలు హితవు చెప్పినట్లు సమాచారం.