రాజకీయాల్లో ఏదైనా ఒక సబ్జెక్టుపై నాయకులకు ప్రశ్నలు ఎదురైతే.. దీనికి సమాధానం చెప్పడం, సవివ రంగా వాటిని తిప్పికొట్టడం అనేది కామన్. నిజానికి ప్రజాస్వామ్యంలో ఇదే అసలైన వ్యవహారం. కానీ, ఏపీ లోని జగన్ ప్రభుత్వం మాత్రం ఎదురు దాడితోనే సమాధానం చెబుతుండడం, ప్రతి విమర్శలు, ఇష్టానురీ తిగా మాటలు అనిపించడం అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తోంది. రాజకీయాల్లో ఉన్నవారికి విమ ర్శలు తప్పవు. ఇక, ప్రభుత్వంలోకి వచ్చాక ఏ పార్టీ అయినా విమర్శలు రాకుండా ఉండాలి.. మమ్మల్ని అనే అర్హత లేదు.. అనే వీలు కూడా లేదు.ఎన్నికలు వేరు.. పార్టీలు, రాజకీయాలు వేరు.
ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన, ఓట్లు రాలనంత మాత్రా న పార్టీలు, నాయకులు నోటికి గుడ్డలు కట్టుకోవాలని ఎవరైనా కోరుకుంటే.. అది నియంతృత్వమే అవు తుందని తొలి ప్రధాని నెహ్రూనే వ్యాఖ్యానించారు. కానీ, ఏపీలో మాత్రం జగన్ ప్రభుత్వం దీనికి భిన్నంగా వ్యవహరి స్తోంది. వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న పవన్ సహా కొందరు నాయకులపై తీవ్రమైన విమర్శ లు చేయడం ద్వారా విషయాన్ని పక్కదారి పట్టించే కార్యక్రమానికి తీవ్రంగా కృషి చేస్తోంది.ఈ విషయంలో కొందరు సెలెక్టడ్ మంత్రులనే వినియోగిస్తుండడం గమనార్హం. నిజానికి జగన్ పాలన ప్రారంభమై ఆరు మాసాలు పూర్తయ్యాయి. ఇది తక్కువ కాలమే అయినా.. రాష్ట్రంలో కొత్త సమస్యలు చోటు చేసుకున్నాయి. అదే సమయంలో అభివృద్ధిపై ప్రభుత్వం ఏం చేయాలని భావిస్తోందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. కేంద్రంతో చెలిమా ? పోరా ? చెలిమి చేసి.. రాష్ట్రానికి మేలు చేయాలని భావిస్తే.. ఏ రూపంలో చేయాలని భావిస్తోంది.
ప్లీజ్ ప్లీజ్ అనడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఇక, పోరు చేస్తే ఎలా చేస్తారు? ఇప్పుడు ఇలాంటి వాటికి జగన్ & ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ, సమాధానం చెప్పకుండా దాటవేత ధోరణి, ఎదురు దాడి ధోరణి అవలంభిస్తే అంతిమంగా అది ఏపీకే చేటని విశ్లేషకులు సూచిస్తున్నారు.